Share News

ఘనంగా 2వ ఎడిషన్‌ సీఎం కప్‌-2025 టార్చ్‌ ర్యాలీ

ABN , Publish Date - Jan 09 , 2026 | 11:27 PM

జిల్లా కేంద్రంలోని జడ్పీ స్కూల్‌ గ్రౌండ్‌లో 2వ ఎడిషన్‌ చీఫ్‌ మినిస్టర్స్‌ కప్‌-2025 టార్చ్‌ ర్యా లీని ఎమ్మెల్యే కూచకుళ్ల రాజేశ్‌రెడ్డి, కలెక్టర్‌ బదావత్‌ సంతోష్‌, ఎస్పీ సం గ్రామ్‌సింగ్‌జీ పాటిల్‌ శుక్రవారం ప్రారంభించారు.

ఘనంగా 2వ ఎడిషన్‌ సీఎం కప్‌-2025 టార్చ్‌ ర్యాలీ
ర్యాలీని ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే కూచకుళ్ల రాజేశ్‌రెడ్డి, కలెక్టర్‌ బదావత్‌ సంతోష్‌, ఎస్పీ సంగ్రామ్‌సింగ్‌ జీ పాటిల్‌

నాగర్‌కర్నూల్‌, జనవరి 9 (ఆంధ్రజ్యోతి) : జిల్లా కేంద్రంలోని జడ్పీ స్కూల్‌ గ్రౌండ్‌లో 2వ ఎడిషన్‌ చీఫ్‌ మినిస్టర్స్‌ కప్‌-2025 టార్చ్‌ ర్యా లీని ఎమ్మెల్యే కూచకుళ్ల రాజేశ్‌రెడ్డి, కలెక్టర్‌ బదావత్‌ సంతోష్‌, ఎస్పీ సం గ్రామ్‌సింగ్‌జీ పాటిల్‌ శుక్రవారం ప్రారంభించారు. క్రీడాకారులను ఉ త్సాహపరించారు. ఎమ్మెల్యే మాట్లా డుతూ గ్రామీణప్రాంతాల నుంచి ప్ర తిభావంతులై క్రీడాకారులను వెలికితీ యడమే ఈ పోటీల ప్రధానోద్దేశ్యమ న్నారు. కార్యక్రమంలో మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ రమణారావు, ఆర్టీఏమెంబరు గోపాల్‌రెడ్డి, మాజీ కౌన్సిలర్లు, క్రీడాకారులు, క్రీడాభిమానులు, అధి కారులు, ప్రజాప్రతినిధులు, యువజన నాయ కులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

సీసీ రోడ్డు పనులు ప్రారంభం

నాగర్‌కర్నూల్‌ టౌన్‌, జనవరి 9 (ఆంధ్రజ్యో తి) నాగర్‌కర్నూల్‌ మునిసిపాలిటీ పరిధిలోని నాగనూలు 4, 5 వార్డుల్లో స్థానిక ఎమ్మెల్యే రాజేష్‌రెడ్డి శుక్రవారం భూమిపూజ నిర్వహించి సీసీ రోడ్డు పనులను ప్రారంభించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ కాంగ్రెస్‌ ప్రభుత్వం మునిసిపాలి టీల సమగ్ర అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికతో ఉం దన్నారు. కార్యక్రమంలో మార్కెట్‌ కమిటీ చైర్మ న్‌ రమణారావు, కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నా యకులు కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jan 09 , 2026 | 11:27 PM