మేడారం జాతరకు 28 ప్రత్యేక రైళ్లు
ABN , Publish Date - Jan 23 , 2026 | 04:16 AM
మేడారం జాతరకు వెళ్లే భక్తుల కోసం ప్రత్యేకంగా 28 జనసాధారణ్ రైళ్లను నడుపుతున్నట్టు దక్షిణ మధ్య రైల్వే అధికారులు వెల్లడించారు.
హైదరబాద్, జనవరి22(ఆంధ్రజ్యోతి): మేడారం జాతరకు వెళ్లే భక్తుల కోసం ప్రత్యేకంగా 28 జనసాధారణ్ రైళ్లను నడుపుతున్నట్టు దక్షిణ మధ్య రైల్వే అధికారులు వెల్లడించారు. జనవరి 28, 30, ఫిబ్రవరి 1వతేదీల్లో సికింద్రాబాద్ - మంచిర్యాల్ మూడు రైళ్లు, మంచిర్యాల్-సికింద్రాబాద్ మూడు రైళ్లు, జనవరి 29, 31 తేదీల్లో సికింద్రాబాద్-సిర్పూర్ కాగజ్‌నగర్ మధ్య రెండు రైళ్లు, సికింద్రాబాద్-సిర్పూర్ కాగజ్‌నగర్ మధ్య రెండు రైళ్లు, జనవరి 28, 29, 30, 31 తేదీల్లో నిజామాబాద్-వరంగల్ మధ్య నాలుగు రైళ్లు, వరంగల్-నిజామాబాద్ మధ్య నాలుగు రైళ్లు, కాజీపేట-ఖమ్మం మధ్య నాలుగు రైళ్లు, ఖమ్మం-కాజీపేట మధ్య నాలుగు రైళ్లు, జనవరి 28న ఆదిలాబాద్- కాజీపేట మధ్య ఒక రైలు, 29న కాజీపేట- ఆదిలాబాద్ మధ్య మరో ప్రత్యేక రైలును నడుపుతున్నట్టు రైల్వే అధికారులు పేర్కొన్నారు.