Share News

kumaram bheem asifabad-మున్సిపల్‌ పోరులో 224 మంది అభ్యర్థులు

ABN , Publish Date - Feb 03 , 2026 | 11:24 PM

జిల్లాలో ఈనెల 11న జరుగనున్న మున్సిపల్‌ ఎన్నికల సంగ్రామంలో 224 మంది అభ్యర్థులు బరిలో నిలిచి తమ అదృష్ట్యాన్ని పరీక్షించు కోనున్నారు. మంగళవారం నామినేషన్ల ఉపసంహరణ ఘట్టం ముగియడంతో తుది జాబితాను అధికారులు వెల్లడించారు. జిల్లాలోని ఆసిఫాబాద్‌ మున్సిపాలిటీలో 26 మంది తమ నామినేషన్లను ఉపసంహరించుకోగా 94 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు.

kumaram bheem asifabad-మున్సిపల్‌ పోరులో  224 మంది అభ్యర్థులు
కాగజ్‌నగర్‌ మున్సిపల్‌ కార్యాలయం

- ముగిసిన ఉపసంహరణల పర్వం

- అభ్యర్థులకు గుర్తుల కేటాయింపు

ఆసిఫాబాద్‌, ఫిబ్రవరి 3 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో ఈనెల 11న జరుగనున్న మున్సిపల్‌ ఎన్నికల సంగ్రామంలో 224 మంది అభ్యర్థులు బరిలో నిలిచి తమ అదృష్ట్యాన్ని పరీక్షించు కోనున్నారు. మంగళవారం నామినేషన్ల ఉపసంహరణ ఘట్టం ముగియడంతో తుది జాబితాను అధికారులు వెల్లడించారు. జిల్లాలోని ఆసిఫాబాద్‌ మున్సిపాలిటీలో 26 మంది తమ నామినేషన్లను ఉపసంహరించుకోగా 94 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఇందులో కాంగ్రెస్‌ నుంచి 19, బీఆర్‌ఎస్‌ తరుపున 20, బీజేపీ నుంచి 8, బీఎస్పీ నుంచి 3, సీపీఐ తరుపున 3, సీపీఎం నుంచి ఒకరు, జనసేన నుంచి 8, స్వతంత్రులు 22 మంది బరిలో ఉన్నారు. కాగజ్‌నగర్‌ మున్సిపాలిటీలో 40 మంది తమ నామినేషన్లను ఉపసంహరించుకోగా 130 మంది బరిలో ఉన్నారు. ఇందులో కాంగ్రెస్‌ నుంచి 29, బీఆర్‌ఎస్‌ నుంచి 30, బీజేపీ పుంచి 30, బీఎస్పీ నుంచి 8, సీపీఐ నుంచి 2, సీపీఎం నుంచి 3, జనసేన నుంచి 2, ఇతర పార్టీల నుంచి 3, స్వతంత్రులు 23 మంది బరిలోకి దిగుతున్నారు. ఆసిఫాబాద్‌, కాగజ్‌నగర్‌ మున్సిపాలిటీలలో ఎన్నికల అదికారులు మధ్యాహ్నం 3 గంటల వరకు ఉపసంహరణ ప్రక్రియ పూర్తి చేయగా ఆ తర్వాత అభ్యర్థులకు గుర్తులను కేటాయించారు. ప్రదాన పార్టీల అభ్యర్థులకు ఆ పార్టీ గుర్తులను కేటాయించగా స్వతంత్ర అభ్యర్థులకు వివిద రకాల గుర్తులను కేటాయించారు. కాగా ఆసిఫాబాద్‌ మున్సిపల్‌ ఎన్నికల బరిలో 94 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. మున్సిపాలిటీ పరిధిలోని 20 వార్డుల్లో కాంగ్రెస్‌, బీజేపీ, బీఆర్‌ఎస్‌, బీఎస్పీ, జనసేన, సీపీఐ(ఎం), సీపీఐ పార్టీలతో పాటు ఇండిపెండెంట్‌ అభ్యర్థులు బరిలో నిలిచి తమ అదృష్టాన్ని పరిక్షించుకొనున్నారు. ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్థులకు సంబందించిన బీఫాంలను ఆయా పార్టీల ఆదినాయకులు ఎన్నికల అదికారులకు సమర్పించారు. ఆసిఫాబాద్‌ వార్డుల వారీగా ప్రధాన పార్టీలైన కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌, బీజేపీ అభ్యర్థుల వివరాలు ఈ కింది విధంగా ఉన్నాయి.

- వార్డుల వారీగా ఇలా..

ఆసిఫాబాద్‌ ఒకటో వార్డులో కట్కార్‌ భీంరావు(కాంగ్రెస్‌), ఇప్ప నాగరాజు(బీఆర్‌ఎస్‌), ఎముర్ల శంకర్‌(బీజేపీ), రెండో వార్డులో మెంగ్రె మోహన్‌(కాంగ్రెస్‌), షెండె గణేష్‌(బీఆర్‌ఎస్‌), పొన్న తిరుపతి(బీజేపీ) మూడో వార్డులో వైరాగడే సాయి(కాంగ్రెస్‌), మెంగ్రె ఆకాష్‌(బీఆర్‌ఎస్‌ నాలుగో వార్డులో దారావత్‌ జయంతి(కాంగ్రెస్‌), కుర్సెంగ బాలకృష్ణ(బీఆర్‌ఎస్‌), నవనందుల సరళ(బీజేపీ) ఐదో వార్డులో కొండవార్‌ స్వప్నరాణి(కాంగ్రెస్‌), అయేషా తస్కీన్‌(బీఆర్‌ఎస్‌), అన్నం సంధ్యారాణి(బీజేపీ) బరిలో ఉన్నారు. ఆరో వార్డులో పుల్లూరి రవిందర్‌(కాంగ్రెస్‌), చిలువేరి వెంకన్న(బీఅర్‌ఎస్‌), కవాల్కర్‌ బాబురావు(బీజేపీ), ఏడో వార్డులో ఒరగంటి హర్షిత(కాంగ్రెస్‌), తణుకు బార్గవి(బీఆర్‌ఎస్‌), చిప్ప కావ్య(బీజేపీ), ఎనిమిదో వార్డులో లోనారే తార(కాంగ్రెస్‌), మామిడి శీరిష(బీఆర్‌ఎస్‌), రాపర్తి రాధిక(బీజేపీ) తొమ్మిదో వార్డులో రూప్‌నార్‌ రమేష్‌(కాంగ్రెస్‌), సాలంబీన్‌ ఆహ్మద్‌(బీఆర్‌ఎస్‌), అకుల సంతోష్‌కుమార్‌(బీజేపీ), పదో వార్డులో చునార్కర్‌ రాజ్‌కుమార్‌(కాంగ్రెస్‌), దూడల ఆశోక్‌(బీఆర్‌ఎస్‌), మటూరి రాజయ్య(బీజేపీ) పోటీ పడుతున్నారు. 11వ వార్డులో రాపర్తి కార్తీక్‌(కాంగ్రెస్‌), రాపర్తి రవిందర్‌(బీఆర్‌ఎస్‌), చిలుకూరి మహేష్‌(బీజేపీ), 12వవార్డులో కె కృష్ణమ్మ(కాంగ్రెస్‌), అత్రం భీంబాయి(బీఆర్‌ఎస్‌), అత్రం నందుబాయి(బీజేపీ), 13వ వార్డులో గుండా స్నేహ(కాంగ్రెస్‌), మాచర్ల సురేఖ(బీఆర్‌ఎస్‌), సెర్ల విజయ(బీజేపీ), 14వ వార్డులో కొండు భారతి(కాంగ్రెస్‌), చిలుకూరి శైలజ(బీఆర్‌ఎస్‌), సెర్ల సారిక(బీజేపీ) వార్డు నంబరు 15లో అబ్దుల్లా(కాంగ్రెస్‌), అహ్మద్‌బీన్‌ అబ్దుల్లా(బీఆర్‌ఎస్‌), రాపర్తి సందీప్‌(బీజేపీ) బరిలో నిలిచారు 16వవార్డులో దుర్గం రోజా(కాంగ్రెస్‌), దూడల లక్ష్మి(బీఆర్‌ఎస్‌), ఇగురపు పార్వతి(బీజేపీ), 17వవార్డులో షేక్‌ అసాద్‌(కాంగ్రస్‌), ఎండీ ఆహ్మద్‌(బీఆర్‌ఎస్‌), వార్డు నంబరు 18లో జవేరియా ఇమ్రాన్‌ (కాంగ్రెస్‌), మలేఖ ఖజ్రాన్‌ బేగం(బీఆర్‌ఎస్‌), రాధిక(బీజేపీ), 19వ వార్డులో లో నాగుబాయి (బీఆర్‌ఎస్‌), రోహిణి మసాదే(బీజేపీ), 20వ వార్డులోలో బోయిరే మంజుల(కాంగ్రెస్‌), జేబా షేక్‌(బీఆర్‌ఎస్‌), చెన్నూరీ రమ్య(బీజేపీ) కాగా కాంగ్రెస్‌ పార్టీ 19వ వార్డులో, బీజేపీ పార్టీ వార్డు-3, వార్డు-17లలో అభ్యర్థులను బరిలో దించలేదు. బీఆర్‌ఎస్‌ పార్టీ తరపున 20 వార్డులో అభ్యర్థులు బరిలో ఉన్నారు. అలాగే బీఎస్పీ, జనసేన, సీపీఐ(ఎం), సీపీఐ, స్వతంత్రులు కొన్ని చోట్ల బరిలో నిలిచారు.

కాగజ్‌నగర్‌లో...

కాగజ్‌నగర్‌, (ఆంధ్రజ్యోతి): కాగజ్‌నగర్‌ మున్సిపాల్టీ ఎన్నికల బరిలో ఉన్న జాబితాను మున్సిపల్‌ కమిషనర్‌ అంజయ్య ప్రకటించారు. ఒకటో వార్డు అయిషా బేగం (బీఆర్‌ఎస్‌), గజ్జల జ్యోతి(బీజేపీ), సరిత(కాంగ్రెస్‌) బరిలో ఉన్నారు. రెండో వార్డు నుంచి కల్వాల విమల్‌ కుమార్‌(బీజేపీ), కామిరి బాబురావు(బీఆర్‌ఎస్‌), నిస్సిత (కాంగ్రెస్‌), 3వ వార్డు కనుకుంట్ల శ్రీలత(బీఆర్‌ఎస్‌), గడ్డం స్వరూప(కాంగ్రెస్‌). చంద్రకళ(బీజేపీ), నాలుగో వార్డు నుంచి బీజేపీతరుపున ఉడుత స్వరూప, బీఆర్‌ఎస్‌ నుంచి భాగ్యలక్షి, కాంగ్రెస్‌ నుంచి వంగరి సాగరిక, ఐదో వార్డు బీఆర్‌ఎస్‌ తరుపున ఇమ్మడి పోచయ్య, బీజేపీ నుచి పారిపెల్లి రాణి, కాంగ్రెస్‌ నుంచి విజయలక్ష్మి బరిలో నిలిచారు. 6వ వార్డు ఎమ్మాజీ శారద(కాంగ్రెస్‌), దెబ్బటి రూప, (బీజేపీ), పిరిసింగుల వాణి(బీఆర్‌ఎస్‌), 7వ వార్డు నక్క జ్యోతి(బీఆర్‌ఎస్‌), మిట్టపల్లి కమల(బీజేపీ) , షమీం బాను(కాంగ్రెస్‌) , 8వ వార్డు అర్షద్‌ అహ్మద్‌(కాంగ్రెస్‌), బీజేపీ గజ్జల నుంచి లావణ్య, బీఆర్‌ఎస్‌ నుంచి విద్యావతి బరిలో నిలిచారు. 9వ వార్డులో బీఆర్‌ఎస్‌ నుంచి గుల్నాజ్‌ తబుస్సం, పద్మ బీజేపీ నుంచి, కాంగ్రెస్‌ నుంచి అంజుం బరిలో లిచారు. 10వ వార్డు బీజేపీ లత సిందం, బీఆర్‌ఎస్‌ వనమాల శ్రీధర్‌, 11వ వార్డు బీజేపీ దెబ్బటి శ్రీనివాస్‌, బీఆర్‌ఎస్‌ మహ్మద్‌ వలీ, కాంగ్రెస్‌ నుంచి బి.వెంకటేశంలో పోటీలో నిలిచారు. 12వ వార్డు నుంచి బీజేపీ తరుపున సుగుణ, బీఆర్‌ఎస్‌ నుంచి కవిత, కాంగ్రెస్‌ నుంచి దుర్గమ్మ, 13వ వార్డులో కాంగ్రెస్‌ నుంచి ఖమర్రునిసా, బీఆర్‌ఎస్‌ నుంచి ఫహిమా, బీజేపీ నుంచి స్నేహిత మదిరె, 14వ వార్డు కాంగ్రెస్‌ నుంచి చిమ్మని రేణుకా, బీఆర్‌ఎస్‌ నుంచి నసీం బాను, బీజేపీ నుంచి సటో జంజోడ్‌ బరిలో ఉన్నారు. 15వ వార్డు బీజేపీ నుంచి వీరభద్రచారి, బీఆర్‌ఎస్‌ నుంచి విద్యావతి, కాంగ్రెస్‌ నుచి రంగు వినోద్‌ కుమార్‌, 16వ వార్డులో కాంగ్రెస్‌ నుంచి కచ్చకయాల జ్యోతి, బీఆర్‌ఎస్‌ నుంచి నారా రాజు, బీజేపీ నుంచి శోభ, 17వ వార్డులో బీజేపీ నుంచి లోకేష్‌, కాంగ్రెస్‌ నుంచి కావేటి విజయ్‌కుమార్‌, బీఆర్‌ఎస్‌ నుంచి విజయ్‌కుమార్‌ యాదవ్‌ పోటీలో ఉన్నారు. 18 వార్డులో బీజేపీ నుంచి సేవంతబాయి, బీఆర్‌ఎస్‌ నుంచి సువర్ణ, కాంగ్రెస్‌ తరుపున షహీన్‌ సుల్తానా, 19వ వార్డులో బీఆర్‌ఎస్‌ నుంచి గాజుల స్వప్న, కాంగ్రెస్‌ నుంచి గోగర్ల మానస, బీజేపీ నుంచి బోగే శ్రీలత, 20వ వార్డులో బీజేపీ నుంచి గాయత్రీ, కాంగ్రెస్‌ నుంచి తస్కిన్‌ బేగం, బీఆర్‌ఎస్‌ నుంచి రుమాన బేగం పోటీ చేస్తున్నారు. 21వ వార్డులో బీఆర్‌ఎస్‌ నుంచి కీర్తి రేఖ, బీజేపీ నుంచి కృష్ణవేణి, కాంగ్రెస్‌ నుంచి జక్కు సంధ్య, 22వ వార్డులో కాంగ్రెస్‌ నుంచి శరత్‌, బీజేపీ నుంచి మానస, బీఆర్‌ఎస్‌ నుంచి మినాజ్‌, 23వ వార్డు లో బీజేపీ నుంచి కంభం పాటి రమ్య, బీఆర్‌ఎస్‌ నుంచి గజ్జి స్వాతి, కాంగ్రెస్‌ నుంచి సనబేగం, 24వ వార్డులో కాంగ్రెస్‌ నుంచి దెబ్బటి సునితా, బీఆర్‌ఎస్‌ నుంచి రవికుమార్‌, బీజేపీ నుంచి దేశ్‌ముఖ్‌ శ్రీనివాస్‌ పోటీలో ఉన్నారు. 25వ వార్డులో బీజేపీ నుంచి కిరణ్‌ బేబి, కాంగ్రెస్‌ నుంచి దుర్గం సూరజ్‌, బీఆర్‌ఎస్‌ నుంచి శ్రీనివాస్‌ కుడిక, 26వ వార్డులో బీజేపీ నుంచి ఆడేటి శంకర్‌, కాంగ్రెస్‌ నుంచి వాసి మున్సిశా, బీఆర్‌ఎస్‌ నుంచి షేక్‌ మహబూబ్‌, 27వ వార్డులో కాంగ్రెస్‌ నుంచి కవిత, బీజేపీ నుంచి శ్రీదేవి, బీఆర్‌ఎస్‌ నుంచి అంజుమ్‌, 28 వార్డులో బీఆర్‌ఎస్‌ నుంచి సప్తగిరి, కాంగ్రెస్‌ నుంచి ముత్తు ఆశోక్‌, బీజేపీ నుంచి విశ్వేశ్వర్‌ రావు, 29వ వార్డులో బీజేపీ నుంచి అనిత కొత్తపల్లి, కొంగ కార్తీక్‌(కాంగ్రెస్‌), రాజ్‌కుమార్‌(బీఆర్‌ఎస్‌) , 30వ వార్డులో మాణిక్యారావు(బీఆర్‌ఎస్‌) , తిరుపతి(బీజేపీ), సరిత (కాంగ్రెస్‌) నుంచి బరిలో ఉన్నట్లు అధికారులు తెలిపారు.

Updated Date - Feb 03 , 2026 | 11:24 PM