Share News

ఊరంతా వనభోజనానికి వెళ్లింది!

ABN , Publish Date - Feb 23 , 2026 | 02:52 AM

వన భోజనాల కోసం వినే ఉంటాం.. కార్తీకమాసంలో అధికంగా జరుగుతుంటాయి. అయితే, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బోడు గ్రామంలోని ప్రజలంతా ఆదివారం వనభోజనానికి వెళ్లారు.

ఊరంతా వనభోజనానికి వెళ్లింది!

  • భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బోడు గ్రామంలో ఘటన

  • సామూహిక వనభోజనాలకు తరలిన 218 కుటుంబాలు

టేకులపల్లి, ఫిబ్రవరి 22 (ఆంధ్రజ్యోతి): వన భోజనాల కోసం వినే ఉంటాం.. కార్తీకమాసంలో అధికంగా జరుగుతుంటాయి. అయితే, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బోడు గ్రామంలోని ప్రజలంతా ఆదివారం వనభోజనానికి వెళ్లారు. అవును.. ఊరు ఊరంతా కలిసి సామూహిక వన భోజనాలకు వెళ్లి ఉత్సాహంగా గడిపారు. గ్రామంలోని సుమారు 218 కుటుంబాల వారు తమ ఇళ్లకు తాళాలు వేసి గ్రామ సమీపంలోని మామిడితోటకు ఉదయాన్నే వెళ్లి వనభోజనాలు చేసి సాయంత్రానికి ఇళ్లకు చేరారు. అన్ని కుటుంబాలు కలిసి ఖర్చును భరించి ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం విశేషం. అయితే, గ్రామానికి ఏదో కీడు ఉందని తెలిసి పూజారుల సూచన మేరకు గ్రామ ప్రజలంతా ఒక రోజు గ్రామం వదిలి వెళ్లారనే ప్రచారం జరుగుతోంది. కానీ బోడు గ్రామ ప్రజలు ఈ విషయాన్ని ఖండిస్తున్నారు. పంటకాలం పూర్తి అయిన తర్వాత ప్రతీ ఏడాది కుటుంబాల వారీగా కలిసి వన భోజనాలకు వెళతామని, ఈ సారి కూడా అలానే వెళ్లామని చెబుతున్నారు. గ్రామంలో బొడ్రాయి పునఃనిర్మాణం కోసం ఈ వనభోజనం గ్రామస్థులమంతా నిర్ణయం తీసుకున్నామని తెలిపారు.

Updated Date - Feb 23 , 2026 | 02:52 AM