Share News

కమిషన్‌ కోసం ఖాతాలిచ్చి కటకటాల పాలు

ABN , Publish Date - Mar 11 , 2026 | 04:42 AM

సైబర్‌ నేరగాళ్లకు కమిషన్లపై తమ బ్యాంకు ఖాతాలు ఇస్తున్న వారి గుట్టు రట్టు చేశామని సైబర్‌ సెక్యూరిటీ బ్యూరో డైరక్టర్‌ శిఖాగోయల్‌ తెలిపారు.

కమిషన్‌ కోసం ఖాతాలిచ్చి కటకటాల పాలు

  • సైబర్‌ నేరగాళ్లకు బ్యాంకు ఖాతాలు ఇచ్చిన 208 మంది అరెస్టు

  • సైబర్‌ సెక్యూరిటీ బ్యూరో డైరక్టర్‌ శిఖాగోయల్‌

హైదరాబాద్‌, మార్చి 10 (ఆంధ్రజ్యోతి): సైబర్‌ నేరగాళ్లకు కమిషన్లపై తమ బ్యాంకు ఖాతాలు ఇస్తున్న వారి గుట్టు రట్టు చేశామని సైబర్‌ సెక్యూరిటీ బ్యూరో డైరక్టర్‌ శిఖాగోయల్‌ తెలిపారు. గత నెలలో రాష్ట్ర వ్యాప్తంగా ఆపరేషన్‌ క్రాక్‌డౌన్‌ పేరిట నిర్వహించిన దాడుల్లో 626 మంది అనుమానితులను గుర్తించి ఇందులో 208 మందిని అరెస్టు చేశామని చెప్పారు. అరెస్టు అయిన వారిలో సామాన్యులే కాకుండా 15 మంది మహిళలు, ఏడుగురు విద్యార్థులు, ఇద్దరు లెక్చరర్లు, విద్యుత్‌ శాఖలో పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగి, ఐదుగురు సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్లు ఉన్నారని తెలిపారు. వీరంతా తమ బ్యాంకు ఖాతాలను నేరగాళ్లకు 5 శాతం కమిషన్‌కు ఆశపడి ఇవ్వడంతో చివరకు జైలుపాలయ్యారని ఆమె పేర్కొన్నారు.

Updated Date - Mar 11 , 2026 | 04:42 AM