Share News

సీఎం చిత్రపటానికి 2008 డీఎస్సీ అభ్యర్థుల క్షీరాభిషేకం

ABN , Publish Date - May 13 , 2026 | 04:20 AM

ప్రజాభవన్‌లో సీఎం రేవంత్‌ చిత్ర పటానికి 2008 డీఎస్సీ అభ్యర్థులు క్షీరాభిషేకం నిర్వహించారు. పదిహేడేళ్లుగా ఎదురుచూస్తున్న తమకు ఉద్యోగాలు ఇచ్చి...

సీఎం చిత్రపటానికి 2008 డీఎస్సీ అభ్యర్థుల క్షీరాభిషేకం

బేగంపేట, మే 12 (ఆంధ్రజ్యోతి): ప్రజాభవన్‌లో సీఎం రేవంత్‌ చిత్ర పటానికి 2008 డీఎస్సీ అభ్యర్థులు క్షీరాభిషేకం నిర్వహించారు. పదిహేడేళ్లుగా ఎదురుచూస్తున్న తమకు ఉద్యోగాలు ఇచ్చి ఆదుకున్నారంటూ కృతజ్ఞతలు తెలిపారు. 2008 డీఎస్సీ బ్యాచ్‌కు చెందిన 1175 మందిని ఇటీవల ఉపాధ్యాయులుగా నియమించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా వారు ప్రజాభవన్‌లో ప్రజావాణి ఇన్‌చార్జి చిన్నారెడ్డిని కలిశారు. తమకు ఉమ్మడి జిల్లా ప్రతిపాదికన పోస్టింగ్స్‌ ఇచ్చారని, కొత్త జిల్లాల ప్రాతిపదికన పోస్టింగ్స్‌ను మార్చాలని వినతిపత్రం అందజేశారు. ఈ అంశాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని చిన్నారెడ్డి వారికి హామీ ఇచ్చారు.

Updated Date - May 13 , 2026 | 04:20 AM