2వేల కోట్లతో రైల్వేస్టేషన్ల ఆధునీకరణ
ABN , Publish Date - May 17 , 2026 | 05:19 AM
అమృత్ భారత్ ేస్టషన్ పథకం కింద తెలంగాణలోని 40 రైల్వే ేస్టషన్ల ఆధునీకరణకు కేంద్రం రూ.2వేల కోట్లకు పైగా వ్యయం చేస్తోందని కేంద్ర బొగ్గు, గనుల ...
కేంద్ర గనుల శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి వెల్లడి
ఉప్పుగూడ, మలక్‌పేట స్టేషన్లలో పనుల పరిశీలన
హైదరాబాద్ సిటీ, చాంద్రాయణగుట్ట/చాదర్‌ఘాట్, మే 16(ఆంధ్రజ్యోతి): అమృత్ భారత్ ేస్టషన్ పథకం కింద తెలంగాణలోని 40 రైల్వే ేస్టషన్ల ఆధునీకరణకు కేంద్రం రూ.2వేల కోట్లకు పైగా వ్యయం చేస్తోందని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి చెప్పారు. ఏబీఎస్ పథకంలో భాగంగా ఆధునీకరణ పనులు జరుగుతున్న ఉప్పుగూడ, మలక్‌పేట్ రైల్వేస్టేషన్లను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా కిషన్‌రెడ్డి మాట్లాడుతూ.. ఉప్పుగూడ రైల్వే స్టేషన్‌ను రూ.27కోట్లతో పునరాభివృద్ధి చేస్తున్నామన్నారు. స్టేషన్‌లో 12 మీటర్ల ఫుట్‌ఓవర్ బ్రిడ్జ్, లిఫ్టులు, ఎస్కలేటర్లు, ర్యాంపులు, వెయింటింగ్ హాల్స్, ేస్టషన్ ఆవరణ అభివృద్ధి వంటి మెరుగైన సౌకర్యాలు ప్రయాణీలకు త్వరలోనే అందుబాటులోకి వస్తాయన్నారు. ఎంఎంటీఎస్ రెండోదశ పనులను మరింత వేగంగా ముందుకు తీసుకెళ్తున్నామన్నారు. మల్లన్న భక్తుల కోసం నిర్మించిన కొమురవెల్లి రైల్వే ేస్టషన్‌ను త్వరలోనే ప్రారంభిస్తామని చెప్పారు. అమృత్ భారత్ స్టేషన్ల పథకం కింద ఆధునీకరించిన మల్కాజిగిరి, రాధాకృష్ణ నగర్, హైటెక్‌సిటీ, హఫీజ్‌పేట్ రైల్వే స్టేషన్లను వెంటనే ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని జోనల్ రైల్వే యూజర్స్ కమిటీ సభ్యులు నూర్, భరద్వాజ్, తదితరులు కిషన్ రెడ్డిని కోరారు. మల్కాజిగిరిలో అన్ని ఎక్స్‌ప్రెస్ రైళ్లను ఆపాలని, తుంగభద్రా ఎక్స్‌ప్రె్‌సను మల్కాజిగిరి, మీదుగా చర్లపల్లి వరకు పొడిగించాలని, సికింద్రాబాద్ నుంచి చర్లపల్లికి మరిన్ని ఎంఎంటీఎస్ రైళ్లు నడపాలని, కాచిగూడ నుంచి ఢిల్లీకి నిజామాబాద్, కరీంనగర్ మీదుగా తెలంగాణ సంపర్క్ క్రాంతి ఎక్స్‌ప్రెస్ ప్రారంభించాలని కోరారు. రైల్వే బోర్డు వద్ద పెండింగులో ఉన్న అభ్యర్థనలకు ఆమోదం లభించేలా చర్యలు తీసుకోవాలని జెడ్‌ఆర్‌యూసీసీ సభ్యులు మంత్రికి విజ్ఞప్తి చేశారు.