ఆచార్య సుజాతపై వేధింపులు ఆపండి
ABN , Publish Date - Apr 17 , 2026 | 04:29 AM
కరీంనగర్ శాతవాహన వర్సిటీ సోషియాలజీ డిపార్ట్‌మెంట్ ప్రొఫెసర్ సుజాతపై అర్బన్ నక్సలైట్ ముద్ర వేసి, వేధింపులకు గురిచేయడాన్ని...
సీఎం రేవంత్ రెడ్డికి 200కిపైగా సామాజికవేత్తల లేఖ
హైదరాబాద్, ఏప్రిల్ 16 (ఆంధ్రజ్యోతి): కరీంనగర్ శాతవాహన వర్సిటీ సోషియాలజీ డిపార్ట్‌మెంట్ ప్రొఫెసర్ సుజాతపై అర్బన్ నక్సలైట్ ముద్ర వేసి, వేధింపులకు గురిచేయడాన్ని ఆపాలని కోరుతూ దేశవ్యాప్తంగా ఉన్న వివిధ రంగాలకు చెందిన 200కి పైగా ప్రముఖులు సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. తెలంగాణ ఉద్యమంతో పాటు అనేక సామాజిక సమస్యలపై క్రియాశీలకంగా పాల్గొంటున్న సుజాతను వర్సిటీకి చెందిన ఏబీవీపీ ప్రతినిధులు, ఇతర ఆచార్యులు తీవ్రంగా వేధిస్తున్నారని లేఖలో పేర్కొన్నారు. వారిపై చర్యలు తీసుకోవాలని ఇప్పటికే ఎస్సీ ఎస్టీ కమిషన్‌కు ఫిర్యాదు చేసినా ఫలితం లేదని, మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఆదేశించినా అధికారుల్లో చలనం లేదని లేఖలో పేర్కొన్నారు. సీఎంకు లేఖ రాసిన వారిలో తెలంగాణ విద్యాకమిషన్ అధ్యక్షుడు ఆకునూరి మురళితోపాటు వివిధ మహిళా సంఘాల ప్రతినిధులు, సామాజికవేత్తలు ఉన్నారు.