Share News

kumaram bheem asifabad-ఇంటర్‌ పరీక్షలకు 19 కేంద్రాలు ఏర్పాటు

ABN , Publish Date - Feb 06 , 2026 | 10:30 PM

జిల్లాలో ఇంటర్‌ వార్షిక పరీక్షలకు 19 కేంద్రాలు ఏర్పాటు చేశామని కలెక్టర్‌ కె హరిత అన్నారు. జిల్లాకు కేటాయించిన ప్రశ్న, జవాబు పత్రాలు శుక్రవారం ప్రత్యేక వాహనంలో రావడంతో వాటిని కలెక్టర్‌ పరిశీలించారు.

kumaram bheem asifabad-ఇంటర్‌ పరీక్షలకు 19 కేంద్రాలు ఏర్పాటు
జవాబు పత్రాల వాహనాన్ని పరిశీలిస్తున్న కలెక్టర్‌ హరిత

ఆసిఫాబాద్‌, ఫిబ్రవరి 6 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో ఇంటర్‌ వార్షిక పరీక్షలకు 19 కేంద్రాలు ఏర్పాటు చేశామని కలెక్టర్‌ కె హరిత అన్నారు. జిల్లాకు కేటాయించిన ప్రశ్న, జవాబు పత్రాలు శుక్రవారం ప్రత్యేక వాహనంలో రావడంతో వాటిని కలెక్టర్‌ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈనెల 25 నుంచి మార్చి 31 వరకు ఇంటర్‌ వార్షిక పరీక్షలు ఉన్నందున ప్రశ్న, జవాబు పత్రాలను స్ట్రాంగ్‌రూంలో భద్రపరిచి పోలీసు బందోబస్తు కల్పించాలన్నారు. జిల్లాలో ఇంటర్‌ వార్షిక పరీక్షలకు 19 కేంద్రాలు ఏర్పాటు చేశామని చెప్పారు. 9,716 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవుతారని తెలిపారు. పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేయాలని జిల్లా ఇంటర్‌ విద్యాధికారి రాందాస్‌ను ఆదేశించారు.

కుట్టు శిక్షణ కేంద్రాన్ని మహిళలు సద్వినియోగం చేసుకోవాలి

ఆసిఫాబాద్‌రూరల్‌, ఫిబ్రవరి 6 (ఆంధ్రజ్యోతి): కుట్టు మిషన్‌ శిక్షణ కేంద్రాన్ని మహిళలు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్‌ కె హరిత అన్నారు. జిల్లా కేంద్రం లోని మండల సమైఖ్య భవన్‌లో శుక్రవారం గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో కొనసాగుతున్న ఉచిత కుట్టుమిషన్‌ శిక్షణ కేంద్రాన్ని సందర్శించారు. శిక్షణ కేంద్రంలో సౌకర్యాలపై ఆ సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్‌ను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ఈ శిక్షణ కేంద్రం ద్వారా జిల్లాలోని ఆసిఫాబాద్‌, జైనూరు, సిర్పూర్‌, కాగజ్‌నగర్‌, వాంకిడి, ఐసీడీఎస్‌ ప్రాజెక్టుల పరిధిలోని అంగన్‌వాడీ కేంద్రాలకు వచ్చే పిల్లలకు 24,765 జతల ఎకరూప దుస్తులు కుట్టి అందించనున్నామని చెప్పారు. విద్యా ర్థులకు నాణ్యతతో కూడిన జతలను నిర్ణీత గడువులోగా అందించాలన్నారు. స్వయం సహాయక సంఘాల మహిళలు ఈ శిక్షణ కేంద్రం ద్వారా ఎకరూప దుస్తులు కుట్టి ఆర్థి కంగా బలోపేతం కావాలన్నారు. శిక్షణ కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచిం చారు. కార్యక్రమంలో డీఆర్‌డీవో దత్తారాం తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Feb 06 , 2026 | 10:30 PM