Share News

అయ్యా.. మా బిడ్డ ప్రాణాలు నిలబెట్టండి!

ABN , Publish Date - Aug 16 , 2026 | 06:32 AM

ప్రాణాంతక సమస్యతో బాధపడుతున్న తమ బిడ్డను బతికించాలంటూ ఆ తల్లిదండ్రులు దాతలను వేడుకుంటున్నారు. బాధితురాలు హైదరాబాద్‌ తుకారాంగేట్‌ సమీపంలోని..

అయ్యా.. మా బిడ్డ ప్రాణాలు నిలబెట్టండి!

  • పదిహేనేళ్ల బాలిక కోసం కన్నవారి ఆరాటం

  • బ్రెయిన్‌ ట్యూమర్‌తో బాధపడుతున్న బాలిక

  • చికిత్సకు రూ.30లక్షలు కావాలి.. దాతలవైపు చూపు

ఆడ్డగుట్ట, ఆగస్టు 15 (ఆంధ్రజ్యోతి): ప్రాణాంతక సమస్యతో బాధపడుతున్న తమ బిడ్డను బతికించాలంటూ ఆ తల్లిదండ్రులు దాతలను వేడుకుంటున్నారు. బాధితురాలు హైదరాబాద్‌ తుకారాంగేట్‌ సమీపంలోని గౌతమ్‌నగర్‌లో ఉంటున్న అనిల్‌, అంజలి దంపతుల బిడ్డ అమృత‘15). బాధిత కుటుంబసభ్యుల కథనం ప్రకారం.. అమృత బ్రెయిన్‌ ట్యూమర్‌తో బాధపడుతోంది. ఆమెకు శస్త్రచికిత్స తప్పనిసరి అని, అందుకు రూ.30 లక్షలు అవసరపడతాయని వైద్యులు చెప్పారు. భవన నిర్మాణ మేస్త్రీగా పనిచేస్తున్న బాలిక తండ్రి అనిల్‌కు అంతడబ్బు వెచ్చించే స్థోమత లేకపోవడంతో దాతలవైపు చూస్తున్నాడు. నాలుగు నెలల క్రితం అమృతకు తలనొప్పి రావడంతో ఆస్పత్రికి తీసుకెళితే పరీక్షించిన వైద్యులు.. ఆమె మెదడులో కణతి ఉన్నట్లు నిర్ధారించారు. అమృతకు చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో శస్త్ర చికిత్స చేయాల్సి ఉంటుందని, ఇందుకు భారీగా ఖర్చు అవుతుందని వైద్యులు సూచించారు. ప్రతినెలా మందులకు భారీగా ఖర్చు పెడుతున్నామని, చికిత్స కోసం దాతలు సహకరించాలని తల్లిదండ్రులు వేడుకుంటున్నారు. అకౌంట్‌ నంబరు (అంజలి) 110219877070, ఐఎ్‌ఫఎ్‌ససీ: సీఎన్‌ఆర్‌బి 0008686 (కెనరా బ్యాంకు-గౌతం నగర్‌ బ్రాంచ్‌)లో లేదా ఫోన్‌ పే నంబరు: 9701866581 (అంజలి)లో సాయం తాలూకు డబ్బులు వేయాలని కోరారు. ఇతర వివరాల కోసం 9553404555 (అనిల్‌) ఫోన్‌ నంబరుకు కాల్‌ చేయాలని కోరారు.

Updated Date - Aug 16 , 2026 | 06:33 AM