Indiramma Housing: ఇందిరమ్మ ఇళ్లకు రూ.152.40 కోట్ల విడుదల
ABN , Publish Date - Jan 15 , 2026 | 06:28 AM
ఇందిరమ్మ ఇళ్ల్ల పథకంలో లబ్ధిదారులకు ప్రతి వారం అందజేసే బిల్లుల చెల్లింపుల ప్రక్రియలో భాగంగా.. ఈ వారానికిగాను రూ. 152.40 కోట్లు మంజూరు చేసినట్లు హౌసింగ్...
హౌసింగ్ కార్పొరేషన్ ఎండీ వీపీ గౌతమ్
హైదరాబాద్, జనవరి 14 (ఆంధ్రజ్యోతి): ఇందిరమ్మ ఇళ్ల్ల పథకంలో లబ్ధిదారులకు ప్రతి వారం అందజేసే బిల్లుల చెల్లింపుల ప్రక్రియలో భాగంగా.. ఈ వారానికిగాను రూ. 152.40 కోట్లు మంజూరు చేసినట్లు హౌసింగ్ కార్పొరేషన్ ఎండీ వీపీ గౌతమ్ తెలిపారు. ఈ విడతలో మొత్తం 13,861 మందికి బిల్లులు చెల్లించినట్లు ఆయన వివరించారు. తాజా నిఽధులతో కలిపి ఈ పథకం కింద ఇప్పటి వరకు రూ.4వేల కోట్ల బిల్లులు చెల్లించినట్లు చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 2.50 లక్షల ఇళ్ల నిర్మాణాలు ప్రారంభం కాగా, సుమారు 1.22 లక్షల ఇళ్లు గోడలు, స్లాబుల దశకు చేరుకున్నాయని తెలిపారు. రాబోయే 3నెలలు ఇళ్ల నిర్మాణానికి అనుకూల సమయం కాబట్టి, మార్చి నాటికి లక్ష ఇళ్ల నిర్మాణం పూర్తిచేయాలని లక్ష్యంగా కార్యాచరణ రూపొందించినట్లు ఆయన చెప్పారు.