మణుగూరు గురుకులంలో 15మంది విద్యార్థినులకు అస్వస్థత
ABN , Publish Date - Mar 10 , 2026 | 03:50 AM
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులోని మహాత్మా జ్యోతిబాఫూలే ప్రభుత్వ బాలికల గురుకుల పాఠశాలలో సోమవారం 15 మంది......
మణుగూరు, మార్చి 9 (ఆంధ్రజ్యోతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులోని మహాత్మా జ్యోతిబాఫూలే ప్రభుత్వ బాలికల గురుకుల పాఠశాలలో సోమవారం 15 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. వాంతులు, విరేచనాలు కావడంతో వెంటనే వారిని ఆస్పత్రికి తరలిం చారు. ఉదయం అనారోగ్యానికి గురైన ముగ్గురు విద్యార్థినులు ఆదివారం వారి కుటుంబీకులు బయట నుంచి తెచ్చిన బిర్యానీ తినడం వల్లే ఇబ్బంది పడ్డారని అధికారులు చెబుతున్నారు. అయితే, సాయంత్రం మరో 12మంది విద్యార్థులు నీరసించి పోవడంతో ఆదివారం మధ్యాహ్నాం హాస్టల్‌లో పెట్టిన మటన్ కూర వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని బాధి త కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై కలెక్టర్ అంకిత్ స్పందిస్తూ.. సమగ్ర విచారణ జరిపి నివేదిక అందించాలని అధికారులను ఆదేశించామన్నారు.