143 హ్యామ్ రోడ్ల పనులకు 31టెండర్లు
ABN , Publish Date - Mar 26 , 2026 | 05:25 AM
రోడ్లు- భవనాల శాఖలో హైబ్రిడ్ యాన్యుటీ మోడ్ (హ్యామ్)లో చేపట్టాల్సిన మొత్తం 34 ప్యాకేజీల్లోని 441 రోడ్ల పనులకు సంబంధించిన టెండర్‌లో...
హైదరాబాద్, మార్చి 25 (ఆంధ్రజ్యోతి): రోడ్లు- భవనాల శాఖలో హైబ్రిడ్ యాన్యుటీ మోడ్ (హ్యామ్)లో చేపట్టాల్సిన మొత్తం 34 ప్యాకేజీల్లోని 441 రోడ్ల పనులకు సంబంధించిన టెండర్‌లో కీలక ప్రక్రియ పూర్తయింది. ఇప్పటికే 24 ప్యాకేజీల టెక్నికల్ బిడ్‌లను తెరవగా, మరో 10 ప్యాకేజీలకు సంబంధించిన టెక్నికల్ బిడ్‌లను అధికారులు బుధవారం తెరిచారు. 10ప్యాకేజీల్లో 1639.89 కిలోమీటర్లు, రూ.3,482.18 కోట్లకు సంబంధించి 143 పనులుండగా, వీటి కోసం 31 టెండర్లు దాఖలయ్యాయి. ఈ 10 ప్యాకేజీల్లో పెద్దపెద్ద కంపెనీలే పాల్గొన్నాయి. 10 రోజుల్లో ఈ టెండర్లను ఎవాల్యుషన్ చేసి, టెక్నికల్‌గా అర్హతలున్న కంపెనీలకు చెందిన ఫైనాన్షియల్ బిడ్‌లను తెరవనున్నారు. ఈ టెండర్లలో కేఎన్‌ఆర్ కన్‌స్ట్రక్షన్, జీకేసీ ప్రాజెక్ట్స్, రాఘవ కన్‌స్ట్రక్షన్స్, మేఘా, సీవెట్ ప్రాజెక్ట్స్, హర్ష కన్‌స్ట్రక్షన్, జేఇన్‌ఫ్రా, శ్రీఇన్‌ఫ్రా, జీత్ ఏసియా, తదితర కంపెనీలు పాల్గొన్నాయి.