ఏప్రిల్ 2, 3 తేదీల్లో అంతర్జాతీయ వస్త్ర సదస్సు
ABN , Publish Date - Mar 11 , 2026 | 05:19 AM
తెలంగాణను అంతర్జాతీయ వస్త్ర, దుస్తుల తయారీ కేంద్రంగా తీర్చిదిద్దే లక్ష్యంతో ఏప్రిల్ 2, 3 తేదీల్లో హైదరాబాద్‌లో నిర్వహించనున్న ...
పోస్టర్ ఆవిష్కరించిన మంత్రులు తుమ్మల, శ్రీధర్‌బాబు
హైదరాబాద్, మార్చి 10 (ఆంధ్రజ్యోతి): తెలంగాణను అంతర్జాతీయ వస్త్ర, దుస్తుల తయారీ కేంద్రంగా తీర్చిదిద్దే లక్ష్యంతో ఏప్రిల్ 2, 3 తేదీల్లో హైదరాబాద్‌లో నిర్వహించనున్న 13వ ఏసియన్ టెక్స్‌టైల్ కాన్ఫరెన్స్ పోస్టర్‌ను రాష్ట్ర మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, తుమ్మల నాగేశ్వరరావు మంగళవారం ఆవిష్కరించారు. ఈ సదస్సుకు దేశీయ, అంతర్జాతీయ టెక్స్‌టైల్ పరిశ్రమల ప్రతినిధులు, పెట్టుబడిదారులు, నిపుణులు వస్తారని, తెలంగాణలో టెక్స్‌టైల్ రంగానికి మరింత ప్రోత్సాహం లభిస్తుందని ఈ సందర్భంగా మంత్రులు తెలిపారు.