సత్తా చాటిన స్కిల్స్ యూనివర్సిటీ విద్యార్థులు
ABN , Publish Date - May 30 , 2026 | 04:33 AM
హైదరాబాద్‌లోని యంగ్ ఇండియా స్కిల్స్ వర్సిటీ విద్యార్థులు సత్తా చాటారు. డేటా సైన్స్ మేనేజ్‌మెంట్ కోర్సు పూర్తి చేసిన 14 మందిలో ఏకంగా.....
రూ. 7 లక్షల ప్యాకేజీతో మైక్రోసాఫ్ట్‍లో ఉద్యోగం
హైదరాబాద్, మే 29 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్‌లోని యంగ్ ఇండియా స్కిల్స్ వర్సిటీ విద్యార్థులు సత్తా చాటారు. డేటా సైన్స్ మేనేజ్‌మెంట్ కోర్సు పూర్తి చేసిన 14 మందిలో ఏకంగా 11 మంది విద్యార్థులు ప్రపంచ ప్రఖ్యాత టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్‍లో ఉద్యోగాలకు ఎంపికయ్యారు. వీరికి ఏడాదికి 7 లక్షల ప్యాకేజీ దక్కడం విశేషం. స్కిల్ ఆధారిత విద్యతో యువతకు అంతర్జాతీయ స్థాయి అవకాశాలు కల్పించాలన్న లక్ష్యంతో ప్రారంభమైన వర్సిటీకి ఇదొక మైలురాయిగా నిలిచింది. కోర్సు పూర్తిచేసిన వెంటనే బహుళ జాతీయ కంపెనీల్లో అవకాశాలు దక్కడం వల్ల విద్యార్థుల్లో ఉత్సాహం నెలకొంది. ప్రాక్టికల్ ట్రైనింగ్, పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా కోర్సుల రూపకల్పన, కార్పొరేట్ స్థాయి శిక్షణ కారణంగా ఈ విజయం సాధ్యమైందని వర్సిటీ వర్గాలు చెబుతున్నాయి.