యుడైస్ ప్లస్’లో తప్పులుంటే సరిచేసుకోండి
ABN , Publish Date - Sep 23 , 2026 | 07:35 AM
మార్చిలో జరగనున్న పదో తరగతి పరీక్షలకు సంబంధించి విద్యార్థులు తమ వివరాలను సరిచూసుకోవాలని ప్రభుత్వ పరీక్షల విభాగం సంచాలకులు కోరారు.
హైదరాబాద్, సెప్టెంబరు 22 (ఆంధ్రజ్యోతి) : మార్చిలో జరగనున్న పదో తరగతి పరీక్షలకు సంబంధించి విద్యార్థులు తమ వివరాలను సరిచూసుకోవాలని ప్రభుత్వ పరీక్షల విభాగం సంచాలకులు కోరారు. ప్రస్తుతం యుడైస్ ప్లస్ పోర్టల్‌లో ఉండే పేర్లే పదో తరగతి హాల్ టికెట్లు, తర్వాత మెమోలో ముద్రితమవుతాయన్నారు. పేరు, తల్లిదండ్రుల పేర్లు, పుట్టిన తేదీల్లో ఏమైనా తప్పులుంటే విద్యార్థులు పాఠశాల ప్రధానోపాధ్యాయుల దృష్టికి తీసుకెళ్లి సరిచేసుకోవాలని కోరారు.