Share News

kumaram bheem asifabad-108 మొబైల్‌ ఫోన్లు రికవరీ

ABN , Publish Date - Mar 25 , 2026 | 10:27 PM

జిల్లాలో ప్రజలు పోగొట్టుకున్న రూ.10 లక్షల విలువ చేసే 108 ఫోన్లను రకవరీ చేసి బాధితులకు అప్పగించామని ఎస్పీ నితికా పంత్‌ అన్నారు. జిల్లా పోలీసు కార్యాలయంలో బుధవారం సెల్‌పోన్‌ రికవరీ మేళా ఏర్పాటు చేసి జిల్లాలో గత కొన్ని రోజులుగా సీఈఐఆర్‌ ద్వారా పట్టుకున్న రూ.10 లక్షల విలువ చేసే 108 ఫోన్లను బాధితులకు ఎస్పీ ఫోన్‌లను అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఫోన్‌పోయినా, చోరీకి గురైనా సీఈఐఆర్‌ వెబ్‌ ఫోర్టల్‌లో ఫిర్యాదు చేయాలని చెప్పారు.

kumaram bheem asifabad-108 మొబైల్‌ ఫోన్లు రికవరీ
బాధితులకు ఫోన్‌లు అందజేస్తున్న ఎస్పీ నితికా పంత్‌

ఆసిఫాబాద్‌, మార్చి 25 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో ప్రజలు పోగొట్టుకున్న రూ.10 లక్షల విలువ చేసే 108 ఫోన్లను రకవరీ చేసి బాధితులకు అప్పగించామని ఎస్పీ నితికా పంత్‌ అన్నారు. జిల్లా పోలీసు కార్యాలయంలో బుధవారం సెల్‌పోన్‌ రికవరీ మేళా ఏర్పాటు చేసి జిల్లాలో గత కొన్ని రోజులుగా సీఈఐఆర్‌ ద్వారా పట్టుకున్న రూ.10 లక్షల విలువ చేసే 108 ఫోన్లను బాధితులకు ఎస్పీ ఫోన్‌లను అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఫోన్‌పోయినా, చోరీకి గురైనా సీఈఐఆర్‌ వెబ్‌ ఫోర్టల్‌లో ఫిర్యాదు చేయాలని చెప్పారు. ఇలా ఫిర్యాదు చేసిన ఫోన్లను మన రాష్ట్రంలోనే కాకుండా పొరుగు రాష్ట్రాల్లో ఫోన్లు రికవరీ అయ్యాయని చెప్పారు. ప్రస్తుత రోజుల్లో మొబైల్‌ ఫోన్‌ లేనిది ఒక చిన్న లావాదేవీ కూడా చేయలేని మన విలువైన సమాచారం, బ్యాంకు అకౌంట్స్‌, పాస్‌వర్డ్‌ వంటి మొబైల్‌లో సేవ్‌ చేసి పెట్టుకుంటామని తెలిపారు. నేరగాళ్లు మొబైల్‌ ఫొన్‌ దొంగలించి వీక్‌ పాస్‌ వర్డ్‌లను బ్రేక్‌ చేసి పోన్‌పే, గూగుల్‌పే తదితర మాధ్యమాల ద్వారా డబ్బులు కాజేస్తున్నారన్నారు. ఎవరైనా మొబైల్‌ పోగొట్టుకున్నా లేదా దొంగలించబడిన వెంటనే సీఈఐఆర్‌ పోర్టల్‌లో బ్యాక్‌ చేసి సంబంధిత పోలీసు స్టేషన్‌లో సమాచారం ఇవ్వాలని సూచించారు. ఎవరైనా సెకండ్‌హ్యాండ్‌ ఫోన్‌ కొనుగోలు చేసినట్లయితే అట్టి షాపు యజమాని నుంచి రశీదు తప్పని సరిగా తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఐటీకోర్‌ ఇన్స్‌పెక్టర్‌ రవీందర్‌, డీసీఆర్బీ ఇన్స్‌పెక్టర్‌ శ్రీధర్‌, సీఐలు బాలాజీ వరప్రసాద్‌, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

పెట్రోల్‌ కొరత లేదు

ఆసిఫాబాద్‌, మార్చి 25 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో పెట్రోల్‌, డీజిల్‌ కొరత లేదని జిల్లా ఎస్పీ నితికా పంత్‌ అన్నారు. స్థానికంగా బుధవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడారు. సోసల్‌ మీడియాలో ప్రచారంలో ఉన్న వదంతుల కారణంగా ప్రజలు ఆందోళనకు గురవుతూ వాహనాల్లో పుల్‌ బ్యాంక్‌ నింపుకునేందుకు ఒకే సారి పెట్రోల్‌ బంక్‌లకు వెళ్లడం వల్ల అంతరాయం ఏర్పడతుందని చెప్పారు. జిల్లాలో అన్ని పెట్రోల్‌ బంక్‌లకు సరిపడ ఇంధన నిలువలు ఉన్నాయని, సరఫరా కూడా నిరంతరంగా కొనసాగుతున్నదని తెలిపారు. ఎటువంటి కొరత పరిస్థితి లేదని, ప్రజలు అవసరానికి మించి ఇంధనం నిలువ చేసుకోవడానికి ప్రయత్నించవద్దని సూచించారు. అలాగే చేయడం వల్ల ఇతరులకు అసౌకర్యం కలుగుతుందని తెలిపారు. అసత్య వదంతులు వ్యాప్తి చేసే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Updated Date - Mar 25 , 2026 | 10:27 PM