kumaram bheem asifabad- మొదటి రోజు 10 నామినేషన్లు దాఖలు
ABN , Publish Date - Jan 28 , 2026 | 11:04 PM
జిల్లాలోని ఆసిఫాబాద్, కాగజ్‌నగర్ మున్సి పాలిటీల్లో బుధవారం మొదటి రోజులు 10 నామినేషన్లు వచ్చాయి. ఆసిఫాబాద్ మున్సిపాలిటీలో ఐదు నామినేషన్లు దాఖలయ్యాయి. కాగజ్‌నగర్ మున్సిపాలిటీలో ఐదు నామినేషన్లు దాఖలయ్యాయి. మున్సిపల్ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో జిల్లాలోని రెండు మున్సిపల్ కార్యాలయాల వద్ద సందడి వాతావరణం నెలకొంది.
-ఽ ధ్రువీకరణ పత్రాల కోసం కౌంటర్ల ఏర్పాటు
ఆసిఫాబాద్, జనవరి 28 (ఆంధ్రజ్యోతి): జిల్లాలోని ఆసిఫాబాద్, కాగజ్‌నగర్ మున్సి పాలిటీల్లో బుధవారం మొదటి రోజులు 10 నామినేషన్లు వచ్చాయి. ఆసిఫాబాద్ మున్సిపాలిటీలో ఐదు నామినేషన్లు దాఖలయ్యాయి. కాగజ్‌నగర్ మున్సిపాలిటీలో ఐదు నామినేషన్లు దాఖలయ్యాయి. మున్సిపల్ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో జిల్లాలోని రెండు మున్సిపల్ కార్యాలయాల వద్ద సందడి వాతావరణం నెలకొంది. ఎన్నికల్లో బరిలో ఉన్న అభ్యర్థులు తమ నామినేషన్లను దాఖలు చేసేందుకు అవసరమైన ధ్రువీకరణ పత్రాలను పొందేందుకు కార్యాలయాలకు పెద్ద ఎత్తున చేరుకున్నారు. పోటీదారులు ప్రతిపాదిత అభ్యర్థులకు సంబందించిన ఇంటి, తదితర పన్నులు చెల్లించేందుకు ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేశారు. అభ్యర్థులకు పూర్తి స్థాయిలో పన్నులు చెల్లించాకే నో డ్యూస్, నో ప్రాపర్టీ టాక్స్ ధ్రువీకరణ పత్రాలను జారీ చేస్తున్నారు. ధ్రువీకరణ పత్రాల జారీలో మున్సిపల్ అధికారులు ఆలస్యం చేస్తున్నారని పోటీదారులు ఆరోపిస్తున్నారు. అన్ని పన్నులు చెల్లించాక నో డ్యూస్, నో ప్రాపర్టీ టాక్స్ ధ్రువపత్రం జారీ కోసం పోటీదారుల అభ్యర్థుల నుంచి రూ. 500 రుసుం వసూలు చేస్తున్నారు. దీంతో పోటీదారులు అన్ని బకాయిలు చెల్లించాక ధ్రువీకరణ పత్రం జారీ కోసం అదనంగా రూ. 500 వసూలు చేయడంపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు.
పోలీసుల ఆంక్షలు..
ఆసిఫాబాద్ మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో పోలీసులు ఆంక్షలు విధించడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో మున్సిపాలిటీ కార్యాలయం ముందు భాగంలో ఉన్న రోడ్డుకు ఇరువైపులా 100 మీటర్ల దూరంలో పోలీసులు బారికేడ్లను ఏర్పాటు చేసి అటు నుంచి వచ్చి పోయే వాహనాలకు అనుమతి ఇవ్వక పోవడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆ రోడ్డు వెంట పాఠశాలలకు, ఆసుపత్రికి వెళ్లెవారిని వేరే మార్గం ద్వారా వెళ్లాలని పోలీసులు హుకుం జారీ చేశారు. తప్పని పరిస్థితిలో ఇతర మార్గాల గుండా వెళ్లాల్సి వస్తుందని ప్రజలు చెబుతున్నారు.
కాగజ్‌నగర్, (ఆంధ్రజ్యోతి): కాగజ్‌నగర్ మున్సిపాలిటీలో ఎన్నికల వేడి రోజు రోజుకు పెరిగింది. నామినేషన్ల ప్రక్రియ బుధవారం ప్రారంభం కావడంతో ఐదు నామినేషన్లు దాఖలు అయ్యాయి. నామినేషన్లతో పాటు అభ్యర్థులు సమర్పించి అఫిడవిట్‌లు, ఆస్తి పన్ను, ఇతర బకాయిలు నాలుగు లక్షల మేర ఆదాయం సమకూరినట్లు కమిషనర్ తిరుపతి ప్రకటించారు. నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతుండడంతో రాజకీయ చర్చలు ఊపందుకున్నాయి. ముఖ్యంగా శుభముహుర్తాలను పరిగణలోకి తీసుకుంటూ నామినేష న్లు వేయాలని ఆశావహులు భావిస్తున్నారు. బుధవారం 40కి పైగా దరఖాస్తు ఫారాలను తీసుకెళ్లారు. ఆస్తి పన్ను, నీటి పన్ను చెల్లింపుల కోసం మున్సిపల్ కార్యాలయంలో 15 కౌంటర్లను ఏర్పాటు చేశారు. కాగా పోలీసులు రెండంచెల వ్యవస్థను ఏర్పాటు చేశారు. పట్టణ సీఐ ప్రేంకుమార్ ఆధ్వర్యంలో బందో బస్తు నిర్వహించారు. దరఖాస్తు చేసే అభ్యర్థుల నుంచి ఎలాంటి సెల్‌ఫోన్లను అనుమతించలేదు. ఏర్పాట్లను అదనపు కలెక్టర్ దీపక్ తివారి, సబ్ కలెక్టర్ శ్రద్ధశుక్లాలు పర్యవేక్షించి సూచనలు చేశారు.