kumaram bheem asifabad-ఆశ్రమ పాఠశాలల్లో వందశాతం ఉత్తీర్ణత సాధించాలి
ABN , Publish Date - Mar 14 , 2026 | 11:06 PM
పదోతరగతిలో గిరిజన ఆశ్రమ ఉన్నత పాఠశాలల విద్యార్థులు వందశాతం ఉత్తీర్ణత సాధించేలా కృషి చేయాలని గిరిజన సంక్షేమశాఖ డిప్యూటీ డైరెక్టర్ రమాదేవి సూచించారు. వాంకిడి బాలికల ఆశ్రమోన్నత పాఠశాలను శనివారం డీడీ తనిఖీ చేశారు
వాంకిడి, మార్చి 14 (ఆంధ్రజ్యోతి): పదోతరగతిలో గిరిజన ఆశ్రమ ఉన్నత పాఠశాలల విద్యార్థులు వందశాతం ఉత్తీర్ణత సాధించేలా కృషి చేయాలని గిరిజన సంక్షేమశాఖ డిప్యూటీ డైరెక్టర్ రమాదేవి సూచించారు. వాంకిడి బాలికల ఆశ్రమోన్నత పాఠశాలను శనివారం డీడీ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వంటశాల, సరకులు, కూరగాయలు, తదితర వస్తువులను పరిశీలించారు. వంట సామాగ్రిని పరిశుభ్రంగా కడిగి వంటకాలు చేయాలన్నారు. మేనూప్రకారం విద్యార్థులకు భోజనం అందించాలని ఆదేశించారు. పదవతరగతి మొదటి రోజు పరీక్షలు ఎలా రాశారని విద్యార్థినులను అడిగి తెలుసుకు న్నారు. పరీక్షల మధ్యలో చదువుకోవడం కోసం మూడేసి రోజులు సమయం ఉన్నందున విద్యార్థులు గ్యాప్ పీరియడ్‌ను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ప్రతి రోజు సబ్జెక్టు వారిగా ఉపాధ్యాయులు పర్యవేక్షణ చేయాలని ఉపాధ్యాయులను ఆదేశించారు. భయం లేకుండా పరీక్షలు రాయాలన్నారు. అనంతరం విద్యార్థులతో కలిసి సహపంక్తి భోజనం చేశారు. కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు నారా యణమూర్తి, వార్డెన్ పెందోర్ మంగవతి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.