Share News

టెస్టు కల తీరకుండానే..

ABN , Publish Date - Oct 03 , 2026 | 01:05 AM

భారత స్పిన్నర్‌ యజ్వేంద్ర చాహల్‌ ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పాడు. గత నెలలో నార్తాంప్టన్‌షైర్‌ తరఫున కౌంటీల్లో ఆడిన మ్యాచే చివరిదని చాహల్‌ తెలిపాడు.

టెస్టు కల తీరకుండానే..

  • ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌కు చాహల్‌ వీడ్కోలు

లండన్‌: భారత స్పిన్నర్‌ యజ్వేంద్ర చాహల్‌ ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పాడు. గత నెలలో నార్తాంప్టన్‌షైర్‌ తరఫున కౌంటీల్లో ఆడిన మ్యాచే చివరిదని చాహల్‌ తెలిపాడు. 2009లో హరియాణా తరఫున అరంగేట్రం చేసిన తను ఇప్పటివరకు 148 వికెట్లు తీశాడు. అయితే టీమిండియా తరఫున పరిమిత ఓవర్ల ఫార్మాట్లలో మాత్రమే ఆడిన చాహల్‌ టెస్టుల్లో మాత్రం చోటు దక్కించుకోలేకపోయాడు. ‘లార్డ్స్‌లో నా చివరి ఫస్ట్‌ క్లాస్‌ మ్యాచ్‌ ఆడేశాను. టెస్టుల్లో ఆడాలని కల కన్నాను. కానీ అది నెరవేరలేదు. నా దృష్టిలో రెడ్‌ బాల్‌ క్రికెట్‌ అంటే ఫార్మాట్‌ మాత్రమే కాదు. సహనం, పట్టుదల, వ్యక్తిత్వం అంటే దాని నుంచి కూడా నేర్చుకున్నాను. నేనైతే ప్రతీ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నానని భావిస్తున్నాను. అయితే వన్డే, టీ20 ఫార్మాట్‌లో అవకాశాల కోసం నా ప్రయత్నం ఆగదు’ అని చాహల్‌ తెలిపాడు. 17 ఏళ్ల కెరీర్‌లో భారత్‌ తరఫున 72 వన్డేలు, 80 టీ20లకు ప్రాతినిధ్యం వహించిన చాహల్‌ 2023లో చివరిసారి బరిలోకి దిగాడు.

Updated Date - Oct 03 , 2026 | 01:06 AM