చాహల్ నాకు మెసేజ్ చేశాడు
ABN , Publish Date - Apr 14 , 2026 | 03:55 AM
పంజాబ్ కింగ్స్ లెగ్ స్పిన్నర్ యజువేంద్ర చాహల్ మరో వివాదంలో చిక్కుకున్నాడు. చాహల్ తనకు వ్యక్తిగతంగా మెసేజ్ పంపాడని నటి, మోడల్ తానియా చటర్జీ వెల్లడించింది...
ముంబై: పంజాబ్ కింగ్స్ లెగ్ స్పిన్నర్ యజువేంద్ర చాహల్ మరో వివాదంలో చిక్కుకున్నాడు. చాహల్ తనకు వ్యక్తిగతంగా మెసేజ్ పంపాడని నటి, మోడల్ తానియా చటర్జీ వెల్లడించింది. ఈమేరకు తానియా పోస్ట్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ‘నువ్వు క్యూట్‌గా ఉన్నావు’ అని పేర్కొన్నాడంటూ అందుకు సంబంధించిన ఇన్‌బాక్స్ మెసేజ్‌ను చటర్జీ ఆ వీడియోలో చూపింది. కాగా.. ఇటీవల కారు నడుపుతూ సిగరెట్ తాగడమేకాదు..తాగిన సిగరెట్‌ను రోడ్డుపైకి చాహల్ విసురుతున్న వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యింది. దాంతో చాహల్ తీరును ఇప్పుడు నెటిజన్లు తీవ్రంగా ఆక్షేపిస్తున్నారు.