Share News

డబ్ల్యూపీఎల్-2026: రాణించిన జెమీమా.. ఢిల్లీ స్కోర్ 203

ABN , Publish Date - Feb 05 , 2026 | 09:19 PM

డబ్ల్యూపీఎల్-2026 ఫైనల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తలపడతున్నాయి. వడోదర వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి.. మొదట బ్యాటింగ్‌కు దిగినఢిల్లీ 203 పరుగుల భారీ స్కోర్ చేసింది.

డబ్ల్యూపీఎల్-2026: రాణించిన జెమీమా..  ఢిల్లీ స్కోర్ 203
WPL 2026 Final

స్పోర్ట్స్ డెస్క్: డబ్ల్యూపీఎల్-2026 ఫైనల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తలపడతున్నాయి. వడోదర వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ ఓడిన ఢిల్లీ మొదట బ్యాటింగ్‌కు దిగింది. నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయిన ఢిల్లీ క్యాపిటల్స్ 203 పరుగులు చేసింది. కెప్టెన్ జెమీమా(57) అర్ధ సెంచరీతో ఆకట్టుకుంది. అలానే లారా వోల్వార్డ్ట్(44), లిజెల్ లీ(37), చినెల్లే హెన్రీ(35) కూడా రాణించడంతో ఢిల్లీ భారీ స్కోర్ చేసింది. ఇక ఆర్సీబీ బౌలర్లలో సయాలీ సత్ఘరే, అరుంధతి రెడ్డి, నాడిన్ డి క్లర్క్ తలో వికెట్ సాధించారు.

Updated Date - Feb 05 , 2026 | 09:19 PM