ఎవరిదో ఓపెనర్ బెర్త్?శాంసన్, వైభవ్ మధ్య పోటీ
ABN , Publish Date - Sep 13 , 2026 | 05:55 AM
అంతర్జాతీయ క్రికెట్‌లో తొలిసారిగా భారత్-అఫ్ఘానిస్థాన్ జట్ల మధ్య టీ20 సిరీ్‌సకు అంతా సిద్ధమైంది. స్థానిక అరుణ్ జైట్లీ మైదానంలో ఆదివారం నుంచి జరిగే మూడు మ్యాచ్‌లకు అఫ్ఘాన్ ఆతిథ్యం ఇవ్వనుంది. ఇక టీ20 వరల్డ్‌క్‌పను వరుసగా రెండోసారి గెలిచిన ఉత్సాహంలో భారత జట్టు ఐర్లాండ్, ఇంగ్లండ్ పర్యటనలకు వెళ్లి భంగపడింది
ఆఫ్ఘాన్ తో భారత్ తొలి టీ20 నేడు
న్యూఢిల్లీ: అంతర్జాతీయ క్రికెట్‌లో తొలిసారిగా భారత్-అఫ్ఘానిస్థాన్ జట్ల మధ్య టీ20 సిరీ్‌సకు అంతా సిద్ధమైంది. స్థానిక అరుణ్ జైట్లీ మైదానంలో ఆదివారం నుంచి జరిగే మూడు మ్యాచ్‌లకు అఫ్ఘాన్ ఆతిథ్యం ఇవ్వనుంది. ఇక టీ20 వరల్డ్‌క్‌పను వరుసగా రెండోసారి గెలిచిన ఉత్సాహంలో భారత జట్టు ఐర్లాండ్, ఇంగ్లండ్ పర్యటనలకు వెళ్లి భంగపడింది. ఆ తర్వాత జింబాబ్వేపై మాత్రం సిరీస్ గెలవగలిగింది. అదే ఊపును అఫ్ఘాన్‌పైనా కొనసాగించాలనే భావనలో శ్రేయాస్ సేన ఉంది. అయితే ఈ సిరీ్‌సలో జట్టు కూర్పు సమస్యగా మారనుంది. ముఖ్యంగా ఓపెనర్ స్థానం కోసం 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ, సీనియర్ బ్యాటర్ సంజూ శాంసన్‌ల మధ్య పోటీ నెలకొంది. ఽశాంసన్ ఐర్లాండ్ టూర్‌లో విఫలమయ్యాడు. దీంతో ఇంగ్లండ్, జింబాబ్వేల్లో ఓపెనర్‌గా వైభవ్‌ను ఆడించారు. ఇప్పుడు జట్టులో శాంసన్ కూడా ఉండడంతో ఈసారి ఇన్నింగ్స్ ఆరంభించే చాన్స్ ఎవరికి దక్కనుందనే చర్చ నడుస్తోంది. ఆసియాగేమ్స్‌కు ముందు కోచ్ గంభీర్, కెప్టెన్ శ్రేయాస్ ఈ ఇద్దరికీ సమాన అవకాశాలు కల్పించే ఆలోచనలోనూ ఉండొచ్చు. శుక్రవారం నెట్స్‌లో వైభవ్‌కన్నా శాంసన్ మెరుగ్గా ఆడినట్టు సమాచారం. మరోవైపు గాయపడిన ఇషాన్ కిషన్ ఈ మ్యాచ్‌లో ఆడేది సందేహంగా మారింది. అలాగే సుందర్, నితీశ్, బుమ్రా, వరుణ్ రాకతో జట్టు పూర్తి స్థాయి ఆటగాళ్లతో బరిలోకి దిగబోతోంది. అంతేకాకుండా ఆసియా గేమ్స్ ముందు రషీద్, నూర్ అహ్మద్, ముజీబుర్‌లాంటి నైపుణ్యం కలిగిన స్పిన్నర్లను ఎదుర్కోవడం కూడా భారత జట్టుకు చక్కటి సన్నాహకమే. అటు ఇబ్రహీం జద్రాన్ నేతృత్వంలో ఆడనున్న అఫ్ఘానిస్థాన్ జట్టు భారత్‌పై తొలి విజయం కోసం ఎదురుచూస్తోంది.
అఫ్ఘాన్‌తో తుది జట్లు (అంచనా)
భారత్: అభిషేక్, శాంసన్/వైభవ్, ఇషాన్, శ్రేయాస్ (కెప్టెన్), తిలక్, అక్షర్, సుందర్, నితీశ్ కుమార్, అర్ష్‌దీప్, బుమ్రా, వరుణ్.
అఫ్ఘానిస్థాన్: గుర్బాజ్, ఇబ్రహీం జద్రాన్ (కెప్టెన్), నయీబ్, సెడికుల్లా, రసూలి, ఒమర్జాయ్, నబీ, రషీద్, ముజీబుర్, నూర్ అహ్మద్, నవీనుల్ హక్. ఇంగ్లండ్ క్లీన్‌స్వీప్