వీల్‌చైర్ హ్యాండ్‌బాల్ సారథిగా కోటేశ్వర్
ABN , Publish Date - Sep 13 , 2026 | 06:02 AM
వీల్‌చైర్ హ్యాండ్‌బాల్ ప్రపంచ చాంపియన్‌షిప్‌లో పాల్గొనే భారత జట్టుకు తెలుగు ఆటగాడు కోటేశ్వర్ సారథిగా నియమితుడయ్యాడు
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి క్రీడాప్రతినిధి): వీల్‌చైర్ హ్యాండ్‌బాల్ ప్రపంచ చాంపియన్‌షిప్‌లో పాల్గొనే భారత జట్టుకు తెలుగు ఆటగాడు కోటేశ్వర్ సారథిగా నియమితుడయ్యాడు. నల్లగొండ జిల్లా గన్నెర్లపల్లి కోటేశ్వర్ స్వస్థలం. ఆదివారం నుంచి ఈనెల 21వ తేదీ వరకు స్పెయిన్‌లో ఈ వరల్డ్ చాంపియన్‌షిప్ జరగనుంది.