Virat Kohli: కోహ్లీ కొత్త పోస్ట్‌కు లైక్‌ల వెల్లువ!
ABN , Publish Date - Jan 02 , 2026 | 05:55 AM
విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ దంపతులు కొత్త సంవత్సరం వేడుకలను దుబాయ్‌లో ధూం..ధాం..గా జరుపుకొన్నారు. ఈ వేడుకల్లో విరాట్ సోదరుడు వికాస్ కోహ్లీ, సోదరి భావనా కోహ్లీ ధింగార్....
న్యూఢిల్లీ: విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ దంపతులు కొత్త సంవత్సరం వేడుకలను దుబాయ్‌లో ధూం..ధాం..గా జరుపుకొన్నారు. ఈ వేడుకల్లో విరాట్ సోదరుడు వికాస్ కోహ్లీ, సోదరి భావనా కోహ్లీ ధింగార్, ఆమె భర్త, మేనల్లుడు ఆర్యవీర్ కోహ్లీతోపాటు కొద్దిమంది దగ్గరి స్నేహితులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అనుష్కతో ఉన్న ఫొటోను కోహ్లీ ఇన్‌స్టాలో పోస్ట్ చేశాడు. కొత్త ఏడాదిలో విరాట్ పంచుకున్న ఈ తొలి పోస్ట్‌కు నాలుగు గంటల్లో ఏకంగా 50 లక్షల లైక్‌లు రావడం విశేషం. అంతకుముందు ‘నా జీవిత వెలుగు అనుష్కశర్మతో కలిసి 2026లో అడుగుపెడుతున్నా’ అంటూ ఇన్‌స్టాలో కోహ్లీ పోస్ట్ చేసిన 2025 చివరి పోస్ట్‌కు గంటలోపే 40 లక్షల లైక్‌లు వెల్లువెత్తాయి.