‘వియత్నాం’ సెమీస్‌కు ప్రణయ్, తన్వి
ABN , Publish Date - Sep 12 , 2026 | 06:06 AM
భారత షట్లర్లు వియత్నాం ఓపెన్‌లో అదరగొడుతున్నారు. పురుషుల సింగిల్స్‌లో వెటరన్ స్టార్ హెచ్‌ఎస్ ప్రణయ్, మహిళల సింగిల్స్‌లో..
న్యూఢిల్లీ: భారత షట్లర్లు వియత్నాం ఓపెన్‌లో అదరగొడుతున్నారు. పురుషుల సింగిల్స్‌లో వెటరన్ స్టార్ హెచ్‌ఎస్ ప్రణయ్, మహిళల సింగిల్స్‌లో తన్వీ శర్మ, రక్షిత రామ్‌రాజ్, ఇషారాణి బారువా సెమీఫైనల్స్‌కు దూసుకెళ్లారు. క్వార్టర్స్‌లో ప్రణయ్ 28-26, 21-12తో సంస్కార్ సరస్వత్‌పై నెగ్గాడు. తన్వి 21-18, 15-21, 21-14తో భారత్‌కే చెందిన మాళవికపై, రక్షిత 21-12, 21-10తో మాన్సీపై, ఇషారాణి 21-15, 21-18తో హువాంగ్ చింగ్‌పై గెలిచారు.