Share News

టాప్‌లో వైశాలి

ABN , Publish Date - Apr 15 , 2026 | 03:39 AM

క్యాండిడేట్స్‌ చెస్‌ టోర్నీలో భారత గ్రాండ్‌ మాస్టర్‌ వైశాలి సంయుక్తంగా టాప్‌లో నిలిచింది. మహిళల కేటగిరీలో మంగళవారం జరిగిన 13వ రౌండ్‌లో టాన్‌....

టాప్‌లో వైశాలి

  • దివ్యకు ఓటమి

  • క్యాండిడేట్స్‌ చెస్‌

సైప్రస్‌: క్యాండిడేట్స్‌ చెస్‌ టోర్నీలో భారత గ్రాండ్‌ మాస్టర్‌ వైశాలి సంయుక్తంగా టాప్‌లో నిలిచింది. మహిళల కేటగిరీలో మంగళవారం జరిగిన 13వ రౌండ్‌లో టాన్‌ జోంగి (చైనా)తో గేమ్‌ను వైశాలి డ్రా చేసుకొంది. కాగా, పేలవ ఫామ్‌లో ఉన్న దివ్యా దేశ్‌ముఖ్‌.. కేథరినా లాగ్నో (రష్యా) చేతిలో ఓటమి పాలైంది. మొత్తం 13 రౌండ్ల నుంచి వైశాలి, బిబిసార అసుబయేవా (కజకిస్థాన్‌) చెరో 7.5 పాయింట్లతో టైటిల్‌ రేస్‌లో నిలవగా.. దివ్య 5 పాయింట్లతో ఆఖరిదైన 8వ స్థానంలో ఉంది. ఓపెన్‌ కేటగిరీలో కరువానా (అమెరికా)తో గేమ్‌ను ప్రజ్ఞానంద డ్రా చేసుకొన్నాడు. కాగా, ఉజ్బెకిస్థాన్‌ జీఎం జావోకిర్‌ సిండరోవ్‌ మరో రౌండ్‌ మిగిలుండగానే క్యాండిటేట్స్‌ చెస్‌ ఓపెన్‌ విజేతగా నిలిచాడు. 13 రౌండ్ల నుంచి సిండరోవ్‌ 9.5 పాయింట్లతో టాప్‌లో నిలవగా.. ప్రజ్ఞానంద 5.5 పాయింట్లతో ఏడో స్థానంలో ఉన్నాడు. దీంతో 20 ఏళ్ల సిండరోవ్‌.. ఈ ఏడాది చివర్లో జరిగే వరల్డ్‌ చాంపియన్‌షిప్‌లో డిఫెండింగ్‌ చాం్‌ప్‌ గుకేష్‌తో చాలెంజర్‌గా తలపడనున్నాడు.

Updated Date - Apr 15 , 2026 | 03:39 AM