Share News

వైభవ్ సూర్యవంశీ విధ్వంసం.. 28 బంతుల్లోనే సెంచరీ!

ABN , Publish Date - Nov 24 , 2026 | 04:56 PM

టీమిండియా యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ చరిత్ర సృష్టించాడు. ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ వన్డే టోర్నీలో భాగంగా యూఏఈతో జరిగిన మ్యాచ్‌లో 28 బంతుల్లోనే శతకం సాధించాడు.

వైభవ్ సూర్యవంశీ విధ్వంసం.. 28 బంతుల్లోనే సెంచరీ!
Vaibhav Suryavanshi

స్పోర్ట్స్ డెస్క్: టీమిండియా యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ లిస్ట్-ఏ క్రికెట్‌లో సంచలనం సృష్టించాడు. ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ వన్డే టోర్నీలో భాగంగా యూఏఈతో జరిగిన మ్యాచ్‌లో 28 బంతుల్లోనే శతకం సాధించాడు. లిస్ట్-ఏ క్రికెట్‌లో ఇదే అత్యంత వేగవంతమైన సెంచరీ కావడం విశేషం. గతంలో జేక్ ఫ్రేజర్ ఆస్ట్రేలియా దేశవాళీ క్రికెట్‌లో 29 బంతుల్లో సెంచరీ పూర్తి చేశాడు. ఆ రికార్డును తాజాగా వైభవ్ బ్రేక్ చేశాడు.

Updated Date - Nov 24 , 2026 | 04:56 PM