Share News

ఐపీఎల్ 2026: ఆర్చర్‌పై విరుచుకపడ్డా వైభవ్ సూర్యవంశీ

ABN , Publish Date - Apr 04 , 2026 | 04:49 PM

ఐపీఎల్ 2026లో భాగంగా ఇవాళ గుజరాత్ టైటాన్స్, రాజస్థాన్ రాయల్స్ మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ నేపథ్యంలో ఇరుజట్ల ఆటగాళ్లు ప్రాక్టీస్ సెషన్‌లో పాల్గొన్నారు. రాజస్థాన్ యువ హిట్టర్ వైభవ్ సూర్యవంశీ.. ఇంగ్లండ్ పేసర్ ఆర్చర్ బౌలింగ్‌లో కళ్లు చేదిరే షాట్లు కొట్టాడు.

ఐపీఎల్ 2026: ఆర్చర్‌పై విరుచుకపడ్డా వైభవ్ సూర్యవంశీ

స్పోర్ట్స్ డెస్క్: ఐపీఎల్ 2026లో భాగంగా ఇవాళ గుజరాత్ టైటాన్స్, రాజస్థాన్ రాయల్స్ తలపడనున్నాయి. అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియంలో రాత్రి 7:30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్‌లో ఓడిన గుజరాత్.. ఈ మ్యాచ్‌లో తప్పక గెలవాలనే కసితో ఉంది. అలానే వరుసగా రెండో విజయాన్ని తమ ఖాతాలో వేసుకోవాలని రాజస్థాన్ పట్టుదలతో ఉంది. ఈ క్రమంలో ఇరు జట్ల ఆటగాళ్లు ముమ్మరంగా ప్రాక్టీస్ చేస్తోన్నారు. ఈ నేపథ్యంలో రాజస్థాన్ రాయల్స్ యువ హిట్టర్ వైభవ్ సూర్యవంశీ ప్రాక్టీస్ సెషన్‌కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.


విధ్వంసకర బ్యాటర్‌గా పేరు తెచ్చుకున్న ఈ 15 ఏళ్ల సూర్యవంశీ ప్రాక్టీస్ సెషన్‌లో మరోసారి సత్తా చాటాడు. నెట్స్‌లో వైభవ్.. ఇంగ్లండ్ స్టార్ పేసర్ జోఫ్రా ఆర్చర్‌ను ఎదుర్కొన్నాడు. కట్స్, పుల్స్‌తో సహా పలు రకాల షాట్లతో గుజరాత్ టైటాన్స్ కు పరోక్షంగా వార్నింగ్ ఇచ్చాడు. ఆర్చర్ వేసిన వేగవంతమైన బంతులను ఎదుర్కొంటూ అనేక భారీ షాట్లు ఆడాడు. కొన్ని బంతులను మాత్రమే ఎదుర్కొవడానికి ఈ చిచ్చర పిడుగు ఇబ్బంది పడ్డాడు. ఐపీఎల్ శిక్షణ తీవ్రతను హైలైట్ చేస్తూ, వైభవ్, జోఫ్రా ఆర్చర్‌ల మధ్య జరిగిన ప్రాక్టీస్ సెషన్‌ను చూపిస్తూ రాజస్థాన్ రాయల్స్ 'ఎక్స్'లో ఈ వీడియోను పోస్ట్ చేసింది.


2025లో ఐపీఎల్‌లో అరంగేట్రం చేసిన వైభవ్‌కు గుజరాత్ టైటాన్స్‌పై మంచి రికార్డు ఉంది. కేవలం 35 బంతుల్లో సెంచరీ చేసి.. ఐపీఎల్ అత్యవంత వేగవంతమైన శతకాన్ని నమోదు చేసిన భారతీయ ఆటగాడిగా వైభవ్ రికార్డు సృష్టించాడు. ఆ రికార్డు కూడా గుజరాత్‌పై సాధించాడు. మరోవైపు ఈ సీజన్‌లో మహమ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, కగిసో రబాడా వంటి గుజరాత్ బౌలర్లు గతేడాది ఎదురైన పరాభవానికి ప్రతీకారం తీర్చుకుని, సూర్యవంశీని కట్టడి చేయాలని ఉవ్విళ్లూరుతున్నారు.

Updated Date - Apr 04 , 2026 | 05:03 PM