సబలెంక జొకో జోడీకి షాక్
ABN , Publish Date - Aug 26 , 2026 | 03:57 AM
సూపర్ స్టార్లు సబలెంక, జొకోవిచ్‌కు సీజన్ చివరి గ్రాండ్‌స్లామ్ యూఎస్ ఓపెన్ మిక్స్‌డ్ డబుల్స్‌లో చుక్కెదురైంది. మంగళవారం జరిగిన మిక్స్‌డ్ ప్రీక్వార్టర్స్‌లో...
యూఎస్ ఓపెన్ మిక్స్‌డ్ డబుల్స్
న్యూయార్క్: సూపర్ స్టార్లు సబలెంక, జొకోవిచ్‌కు సీజన్ చివరి గ్రాండ్‌స్లామ్ యూఎస్ ఓపెన్ మిక్స్‌డ్ డబుల్స్‌లో చుక్కెదురైంది. మంగళవారం జరిగిన మిక్స్‌డ్ ప్రీక్వార్టర్స్‌లో టాప్‌సీడ్ సబలెంక/జొకో జోడీ ఓటమి పాలైంది. అన్‌సీడెడ్ ద్వయం సినియకోవా/హెన్రీ ప్యాటన్ 1-4, 4-2 (10-2)తో టాప్‌సీడ్ సబలెంక/జొకో జంటకు షాకిచ్చింది. అనంతరం జరిగిన క్వార్టర్స్‌లో భార్యాభర్తలు స్విటోలినా/మోన్‌ఫిల్స్ జోడీ 5-4 (8-6), 4-5 (3-7), 10-8తో సినియ కోవా/హెన్రీ జంటపై గెలిచి సెమీఫైనల్లోకి ప్రవేశించింది. కాగా.. యూఎస్ ఓపెన్ సింగిల్స్, డబుల్స్ మెయిన్ డ్రా మ్యాచ్‌లు ఈనెల 30నుంచి జరగనున్నాయి.