అల్కారజ్ అదరగొట్టేనా?
ABN , Publish Date - Aug 30 , 2026 | 07:01 AM
కుడిచేతి మణికట్టు గాయం కారణంగా నాలుగు నెలలు టెన్నిస్‌కు దూరమైన స్పెయిన్ వీరుడు కార్లోస్ అల్కారజ్.. యూఎస్ ఓపెన్‌తో మళ్లీ రాకెట్ పడుతున్నాడు. యూఎస్ ఓపెన్ ఆదివారం మొదలవనుంది.
నేటి నుంచి యూఎస్ ఓపెన్
రాత్రి 8.30 నుంచి స్టార్ స్పోర్ట్స్‌లో
జూరికార్డు టైటిల్ వేటలో జొకో జూహ్యాట్రిక్‌పై సబలెంక గురి
న్యూయార్క్: కుడిచేతి మణికట్టు గాయం కారణంగా నాలుగు నెలలు టెన్నిస్‌కు దూరమైన స్పెయిన్ వీరుడు కార్లోస్ అల్కారజ్.. యూఎస్ ఓపెన్‌తో మళ్లీ రాకెట్ పడుతున్నాడు. యూఎస్ ఓపెన్ ఆదివారం మొదలవనుంది. ఈ సీజన్ చివరి గ్రాండ్‌స్లామ్‌లో అల్కారజ్ డిఫెండింగ్ చాంప్‌గా పోటీ పడుతున్నాడు. గాయం నుంచి కోలుకొని మళ్లీ టైటిల్ వేటకు సిద్ధమైన అల్కారజ్, రికార్డుస్థాయిలో 25వ గ్రాండ్‌స్లామ్‌పై గురిపెట్టిన నొవాక్ జొకోవిచ్ ఒకే పార్శ్వంలో తలపడనున్నారు. అంటే రెండో సీడ్ అల్కారజ్, నాలుగో సీడ్ జొకో ముందుకు సాగితే.. సెమీస్‌లో ముఖాముఖి తలపడే చాన్సుంది. ఈసారి వరల్డ్ నెంబర్‌వన్ ఆటగాడు జానిక్ సిన్నర్ గాయంతో టోర్నీకి దూరమవడం అల్కారజ్‌కు కలిసొచ్చే అంశం. సినర్ గైర్హాజరీతో ఫ్రెంచ్ ఓపెన్ విజేత అలెగ్జాండర్ జ్వెరెవ్ (జర్మనీ)కు యూఎస్ ఓపెన్‌లో టాప్ సీడ్ దక్కింది. తొలి రౌండ్‌లో లొ రెంజో సొనెగో (ఇటలీ)తో జ్వెరెవ్, రోమన్ సఫియుల్లీన్‌తో అల్కారజ్, అర్జెంటీనా ఆటగాడు మరియానోతో జొకో తలపడనున్నారు. మూడో సీడ్ ఫెలిక్స్ అగర్ అలియస్సమీ (కెనడా), ఫ్లావియో కొబోల్లీ, మెద్వెదెవ్ కూడా సత్తాచాలనుకొంటున్నారు. కాగా, మహిళల సింగిల్స్‌లో వరుసగా రెండేళ్లు ఇక్కడ విజేతగా నిలిచిన డిఫెండింగ్ చాంప్, టాప్ సీడ్ అరియానా సబలెంక హ్యాట్రిక్‌పై కన్నేసింది. ఈసారీ ట్రోఫీ అందుకుంటే, సెరెనా విలియమ్స్ తర్వాత హ్యాట్రిక్ ఫీట్ సాధించిన రెండో క్రీడాకారిణిగా సబలెంక రికార్డుకెక్కనుంది.
తొలి రౌండ్‌లో కమిల ఒసోరియోతో సబలెంక ఆడనుంది. రెండో సీడ్ రిబకినా, స్థానిక స్టార్ క్రీడాకారిణులు జెస్సికా పెగుల, కొకొ గాఫ్, ఫ్రెంచ్ ఓపెన్ చాంప్ మిర్రా ఆండ్రీవ, పోలెండ్ భామ స్వియటెక్, అలెక్స్ ఏలా నుంచి సబలెంకకు టైటిల్ వేటలో గట్టిపోటీ ఎదురవనుంది. ఇక, ఈసారి విలియమ్స్ సిస్టర్స్ డబుల్స్ బరిలో దిగనుండడం టోర్నీకి ప్రత్యేక ఆకర్షణ కానుంది. వైల్డ్‌కార్డ్ ఎంట్రీ ద్వారా సెరెనా, వీనస్ విలియమ్స్ మహిళల డబుల్స్‌లో జోడీగా బరిలో దిగుతున్నారు.