లాథమ్ అదిరెన్..!
ABN , Publish Date - Mar 21 , 2026 | 03:36 AM
తొలుత కట్టుదిట్టమైన బౌలింగ్‌తో సఫారీలను స్వల్ప స్కోరుకే పరిమితం చేసి, అనంతరం సులువుగా లక్ష్యాన్ని ఛేదించిన న్యూజిలాండ్ మూడో టీ20లో....
ఆక్లాండ్: తొలుత కట్టుదిట్టమైన బౌలింగ్‌తో సఫారీలను స్వల్ప స్కోరుకే పరిమితం చేసి, అనంతరం సులువుగా లక్ష్యాన్ని ఛేదించిన న్యూజిలాండ్ మూడో టీ20లో 8 వికెట్లతో గెలుపొందింది. తద్వారా ఐదు టీ20ల సిరీస్‌లో 2-1తో ఆధిక్యం సాధించింది. మ్యాచ్‌లోకొస్తే.. మొదట దక్షిణాఫ్రికా 20 ఓవర్లలో 9 వికెట్లకు 136 పరుగులు చేసింది. టెయిలెండర్ మొకెనా (26 నాటౌట్) టాప్ స్కోరర్. కివీస్ బౌలర్లలో శాంట్నర్, సియర్స్, జేమిసన్ తలా రెండు వికెట్లు పడగొట్టారు. ఇక తీసింది ఒక్క వికెట్టే అయినా సూపర్ ప్రదర్శనతో బ్యాటర్లను కట్టడి చేసిన ఫెర్గూసన్ (4-0-9-1)కి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. ఛేదనలో ఓపెనర్ టామ్ లాథమ్ (63 నాటౌట్) అజేయ అర్ధ సెంచరీతో అదరగొట్టడంతో కివీస్ 16.2 ఓవర్లలో 137/2 స్కోరు చేసి అలవోకగా గెలిచింది. మరో ఓపెనర్ కాన్వే (39) కీలక ఇన్నింగ్స్ ఆడాడు.