స్విమ్మింగ్‌లో నాలుగు పతకాలు
ABN , Publish Date - Aug 20 , 2026 | 05:56 AM
జాతీయ జూనియర్ ఆక్వాటిక్ చాంపియన్‌షి్‌పలో తెలంగాణ స్విమ్మర్లు నాలుగు పతకాలు కొల్లగొట్టారు...
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి క్రీడాప్రతినిధి): జాతీయ జూనియర్ ఆక్వాటిక్ చాంపియన్‌షి్‌పలో తెలంగాణ స్విమ్మర్లు నాలుగు పతకాలు కొల్లగొట్టారు. భువనేశ్వర్‌లో జరిగిన ఈ పోటీల్లో సుహాస్ ప్రీతం 100 మీటర్ల బ్యాక్‌స్ట్రోక్‌లో స్వర్ణం, నిత్యం 400 మీ. వ్యక్తిగత మెడ్లేలో రజతం, 100 మీ. బ్యాక్‌స్ట్రోక్‌లో కాంస్యం, అన్నిక 50 మీ. ఫ్రీస్టయిల్‌లో కాంస్యం సాధించారు. వీరంతా గచ్చిబౌలి శాట్ స్విమ్మింగ్ కేంద్రంలో శిక్షణ పొందుతున్నారు.