టీమిండియా సెమీస్‌కు చేరుకుంటుందా.. విండీస్‌పై సఫారీలు విజయం సాధించడంతో..
ABN , Publish Date - Feb 26 , 2026 | 09:16 PM
డిఫెండింగ్ ఛాంపియన్, టోర్నీ ఫేవరెట్‌గా తాజా టీ-20 ప్రపంచకప్‌లో బరిలోకి దిగిన టీమిండియాకు సూపర్-8లో దక్షిణాఫ్రికా గట్టి షాకిచ్చింది. టీమిండియాను చిత్తు చేసి ఘన విజయం సాధించింది. దీంతో టీమిండియా సెమీస్ అవకాశాలు కాస్త సంక్లిష్టంగా మారాయి.
డిఫెండింగ్ ఛాంపియన్, టోర్నీ ఫేవరెట్‌గా తాజా టీ-20 ప్రపంచకప్‌లో బరిలోకి దిగిన టీమిండియాకు సూపర్-8లో దక్షిణాఫ్రికా గట్టి షాకిచ్చింది. టీమిండియాను చిత్తు చేసి ఘన విజయం సాధించింది. దీంతో టీమిండియా సెమీస్ అవకాశాలు కాస్త సంక్లిష్టంగా మారాయి. అయితే అదే దక్షిణాఫ్రికా ఈ రోజు (గురువారం) మధ్యాహ్నం జరిగిన మ్యాచ్‌లో విండీస్‌ను చిత్తు చేసి టీమిండియాకు ఆనందాన్ని అందించింది. ఆ గెలుపు దక్షిణాఫ్రికా కంటే టీమిండియా అభిమానులనే ఎక్కువ సంతోషపెట్టింది (Team India semifinal chances).
ప్రస్తుతం గ్రూప్-1 పాయింట్ల పట్టికలో దక్షిణాఫ్రికా (4 పాయింట్లు), విండీస్ (2 పాయింట్లు) జట్లు తొలి రెండు స్థానాల్లోనూ ఉన్నాయి. భారత్, జింబాబ్వే జట్లు ఇంకా ఖాతాలు తెరవలేదు. ప్రస్తుతం చెన్నైలో జింబాబ్వేతో జరుగుతున్న మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా భారీ స్కోరు సాధించింది. నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 256 పరుగులు చేసింది. ఈ మ్యాచ్‌లో ఏదైనా అద్భుతం జరిగితే తప్ప టీమిండియా గెలుపు లాంఛనంగానే కనబడుతోంది (India T20 World Cup scenario).
ఈ మ్యాచ్‌తో పాటు ఆదివారం విండీస్‌తో జరిగే మ్యాచ్‌లో కూడా టీమిండియా గెలిస్తే పాయింట్ల పట్టికలో దక్షిణాఫ్రికా తర్వాత రెండో స్థానంలో నిలుస్తుంది (T20 World Cup points table). రెండు మ్యాచ్‌ల్లోనూ విజయాలు సాధిస్తే నెట్ రన్‌రేట్‌తో పని లేకుండా టీమిండియా సెమీస్‌కు చేరుకుంటుంది. దక్షిణాఫ్రికా ఇప్పటికే రెండు మ్యాచ్‌ల్లోనూ గెలిచి గ్రూప్-1లో అగ్రస్థానంలో ఉంది. ఈ రోజు మ్యాచ్‌లో ఓడిపోతే జింబాబ్వే ఇంటి దారి పడుతుంది. ఆదివారం భారత్, వెస్టిండీస్ మధ్య జరిగే మ్యాచ్‌లో గెలిచే జట్టు సెమీస్‌కు చేరుతుంది.
ఈ వార్తలు కూడా చదవండి..
జూబ్లీహిల్స్‌లో అగ్నిప్రమాదంపై దర్యాప్తు కొనసాగుతోంది: ఫైర్ ఆఫీసర్ రాందాస్
ఖర్గేని కలిసిన జగ్గారెడ్డి.. అసలు విషయమిదే..