ఫైనల్లో తన్వీ
ABN , Publish Date - Nov 29 , 2026 | 03:28 AM
టీనేజ్ సంచలనం తన్వీశర్మ సయ్యద్ మోదీ ఇంటర్నేషనల్ సూపర్ 300 బ్యాడ్మింటన్ టోర్నీ సింగిల్స్‌లో ఫైనల్ చేరింది.
గాయత్రి జోడీ కూడా..
సయ్యద్ మోదీ బ్యాడ్మింటన్
లఖ్‌నవూ: టీనేజ్ సంచలనం తన్వీశర్మ సయ్యద్ మోదీ ఇంటర్నేషనల్ సూపర్ 300 బ్యాడ్మింటన్ టోర్నీ సింగిల్స్‌లో ఫైనల్ చేరింది. శనివారం జరిగిన మహిళల సింగిల్స్ సెమీఫైనల్లో 17 ఏళ్ల తన్వీ 11-21, 21-10, 21-13తో సహచర షట్లర్ ఉన్నతి హుడాపై గెలిచింది. టైటిల్ ఫైట్‌లో సుపనిద కటెథాంగ్ (థాయ్‌లాండ్)తో తన్వీ తలపడుతుంది. మహిళల డబుల్స్‌లో టాప్‌సీడ్ గాయత్రి/ట్రీసా జాలీ జంట 13-21, 21-10, 21-12తో ఉక్రెయిన్ జోడీ పోలిన/యెవెనియాపై గెలిచి తుదిపోరుకు చేరింది. మిక్స్‌డ్ విభాగంలో సాత్విక్ రెడ్డి/రేషిక జోడీ పోరాటం సెమీస్‌కే పరిమితమైంది.