టీ20 ప్రపంచ కప్2026: నిప్పులు చెరిగిన దునిత్.. ఇంగ్లండ్ స్కోర్ 146
ABN , Publish Date - Feb 22 , 2026 | 04:58 PM
టీ20 ప్రపంచ కప్ 2026 సూపర్-8 లో భాగంగా ఇవాళ(ఆదివారం)ఇంగ్లండ్, శ్రీలంక జట్లు తలపడుతున్నాయి. ఈ క్రమంలో టాస్ ఓడిన ఇంగ్లండ్ మొదట బ్యాటింగ్ చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 146 పరుగులు చేసింది.
స్పోర్ట్స్ డెస్క్: టీ20 ప్రపంచ కప్ 2026 సూపర్-8 లో భాగంగా ఇవాళ(ఆదివారం)ఇంగ్లండ్, శ్రీలంక జట్లు తలపడుతున్నాయి. ఈ క్రమంలో టాస్ ఓడిన ఇంగ్లండ్ మొదట బ్యాటింగ్ చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 146 పరుగులు చేసింది. ఓపెనర్ ఫిలిప్ సాల్ట్(40 బంతుల్లో 62) అర్ధ సెంచరీతో రాణించాడు.
మ్యాచ్ విషయానికి వస్తే.. టాస్ గెలిచిన శ్రీలంక బౌలింగ్ ఎంచుకుంది. దీంతో తొలుత బ్యాటింగ్ కు దిగిన ఇంగ్లీష్ జట్టు.. శ్రీలంక బౌలర్ల ధాటికి స్వల్ప స్కోర్ కే పరిమితమైంది. ఇంగ్లండ్ జట్టుకు ప్రారంభంలోనే గట్టి షాక్ తగిలింది. 16 పరుగుల వద్ద జోస్ బట్లర్(7) దునిత్ బౌలింగ్ లో పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత కూడా క్రమం తప్పకుండా ఇంగ్లీష్ జట్టు వికెట్లను కోల్పోయింది. 94 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఒక వైపు వికెట్లు పడుతున్నా ఓపెనర్ ఫిలిప్ సాల్ట్(62) లంక బౌలర్లపై ఎదురు దాడి చేశాడు. చివరకు 106 పరుగుల వద్ద ఆరో వికెట్ గా ఫిలిప్ పెవిలియన్ చేరాడు.
ఆ తర్వాత వచ్చిన బ్యాటర్లు తక్కువ స్కోర్లకే పరిమితమయ్యారు. ఇంగ్లీష్ బ్యాటర్లలో విల్ జాక్స్ 21, హ్యారి బ్రూక్ 14, సామ్ కరన్ 11 పరుగులు చేశారు. ఇక లంక బౌలర్లలో దునిత్ వెల్లలాగే 3 వికెట్లు సాధించి.. ఇంగ్లండ్ జట్టును తక్కువ పరుగులకే పరిమితం చేయడంలో కీలక పాత్ర పోషించాడు. అలానే మహీశ్ తీక్షణ, దిల్షాన్ మధుశంక చెరో రెండు వికెట్లు పడగొట్టారు. చమీర ఒక వికెట్ తీశాడు.