Share News

రహానెకు ఏదీ గుర్తింపు?

ABN , Publish Date - Aug 05 , 2026 | 05:34 AM

ఇటీవలే అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన అజింక్యా రహానెకు సరైన గుర్తింపు దక్కలేదని మాజీ కెప్టెన్‌ సునీల్‌ గవాస్కర్‌ అభిప్రాయపడ్డాడు...

రహానెకు ఏదీ గుర్తింపు?

న్యూఢిల్లీ: ఇటీవలే అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన అజింక్యా రహానెకు సరైన గుర్తింపు దక్కలేదని మాజీ కెప్టెన్‌ సునీల్‌ గవాస్కర్‌ అభిప్రాయపడ్డాడు. ‘భారత సారథిగా రహానెకు అద్భుత రికార్డు ఉంది. తన సారథ్యంలో ఆడిన 6 టెస్టుల్లో ఒక్కటీ ఓడలేదు. అయినా అతని నాయకత్వానికి పెద్దగా ప్రశంసలు రాలేదు. ఆసీస్‌ పర్యటనలో సిరీస్‌ విజయం అతడి కెరీర్‌కే తలమానికం. అలాగే ద్రవిడ్‌ కెప్టెన్సీలోనూ జట్టుకు ఘనవిజయాలే దక్కినా, అతడికీ దక్కాల్సిన గుర్తింపు లభించలేదు. భారత క్రికెట్‌లో ఇది మామూలే. జట్టు గెలిచినప్పుడు ఆ మ్యాచ్‌లో బాగా ఆడిన ఆటగాడిని ఆకాశానికి ఎత్తేస్తారు. ఓడినప్పుడు కెప్టెన్‌, కోచ్‌లను నిందిస్తారు’ అని సన్నీ చెప్పుకొచ్చాడు.

Updated Date - Aug 05 , 2026 | 05:34 AM