ఐపీఎల్2026: ఆదుకున్న నితీశ్, క్లాసెన్.. ఎస్ఆర్‌హెచ్ స్కోర్ 156
ABN , Publish Date - Apr 05 , 2026 | 05:19 PM
సన్ రైజర్స్ హైదరాబాద్ టాప్ ఆర్డర్.. అభిమానులను నిరాశపర్చింది. ఇవాళ ఉప్పల్ వేదికగా లఖ్‌నవూ సూపర్ జెయింట్స్‌తో ఎస్ఆర్‌హెచ్ తలపడుతోంది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడిన హైదరాబాద్ తొలుత బ్యాటింగ్ చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 156 పరుగులు చేసింది.
స్పోర్ట్స్ డెస్క్: సన్ రైజర్స్ హైదరాబాద్ టాప్ ఆర్డర్.. అభిమానులను నిరాశపర్చింది. ఇవాళ(ఆదివారం) ఉప్పల్ వేదికగా లఖ్‌నవూ సూపర్ జెయింట్స్‌తో ఎస్ఆర్‌హెచ్ తలపడుతోంది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడిన హైదరాబాద్ తొలుత బ్యాటింగ్ చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 156 పరుగులు చేసింది. హెన్రిచ్ క్లాసేన్(62), నితీశ్ కుమార్ రెడ్డి(56) రాణించడంతో కనీసం ఆ స్కోర్ అయినా చేయగలిగింది.