కామన్వెల్త్ టీటీలో శ్రీజకు నాలుగు పతకాలు
ABN , Publish Date - Aug 03 , 2026 | 05:03 AM
కామన్వెల్త్ టేబుల్ టెన్నిస్ చాంపియన్‌షిప్‌లో హైదరాబాద్ అమ్మాయి ఆకుల శ్రీజ నాలుగు పతకాలు కొల్లగొట్టింది. ..
న్యూఢిల్లీ: కామన్వెల్త్ టేబుల్ టెన్నిస్ చాంపియన్‌షిప్‌లో హైదరాబాద్ అమ్మాయి ఆకుల శ్రీజ నాలుగు పతకాలు కొల్లగొట్టింది. డబుల్స్ టైటిల్‌తో పాటు టీమ్ విభాగంలో స్వర్ణం, సింగిల్స్‌లో రజతం, మిక్స్‌డ్‌లో కాంస్యం దక్కించుకుంది. ఆదివారం జరిగిన డబుల్స్ ఫైనల్లో శ్రీజ-సిండ్రిల్లా దాస్ జోడీ 11-8, 11-13, 11-8, 11-6తో భారత్‌కే చెందిన యశస్విని-దివ్యాన్షీ జంటపై గెలిచింది. సింగిల్స్ తుదిపోరులో శ్రీజ 6-11, 1-11, 11-8, 7-11, 11-13తో యశస్విని చేతిలో ఓడి రజతంతో సరిపెట్టుకుంది. ఇక, అంతకుముందు జరిగిన టీమ్ విభాగంలో శ్రీజ స్వర్ణం, మిక్స్‌డ్‌లో కాంస్యం సాధించింది.
ఇవి కూడా చదవండి:
దేశానికి ఆడేశా.. ఇక సాధించాల్సింది ఏమీ లేదు: భువనేశ్వర్
ఆసియా కప్ 2026.. హర్మన్‌ప్రీత్ కౌర్ సారథ్యంలో భారత జట్టు ప్రకటన