సెమీస్‌కు భారత్ ‘ఎ’
ABN , Publish Date - Nov 29 , 2026 | 02:58 AM
స్నూకర్ వరల్డ్‌కప్‌లో పంకజ్ ఆడ్వాణీ నేతృత్వంలోని భారత్ ‘ఎ’ జట్టు సెమీస్‌కు దూసుకెళ్లగా.. భారత్ ‘బి’ టీమ్ ఓటమితో టోర్నీ నుంచి నిష్క్రమించింది.
స్నూకర్ వరల్డ్‌కప్
మస్కట్: స్నూకర్ వరల్డ్‌కప్‌లో పంకజ్ ఆడ్వాణీ నేతృత్వంలోని భారత్ ‘ఎ’ జట్టు సెమీస్‌కు దూసుకెళ్లగా.. భారత్ ‘బి’ టీమ్ ఓటమితో టోర్నీ నుంచి నిష్క్రమించింది. శనివారం జరిగిన క్వార్టర్స్‌లో ఆడ్వాణీ, ఆదిత్య మెహతా, బ్రిజేష్ దమానీలతో కూడిన భారత్ ‘ఎ’ 3-1తో ఇరాన్-బి జట్టుపై గెలిచింది. కాగా, సౌరవ్ కొఠారీ, మల్కీత్ సింగ్, కేతన్ చావ్లాలతో కూడిన భారత్ ‘బి’ జట్టు 0-3తో పాకిస్థాన్ ‘బి’ టీమ్ చేతిలో ఓడింది. ఆదివారం జరిగే సెమీ్‌సలో పాకిస్థాన్ ‘ఎ’ టీమ్‌తో భారత్ ‘ఎ’ తలపడనుంది.