శివ్‌పాల్, స్వప్నలపై నిషేధం
ABN , Publish Date - Aug 21 , 2026 | 02:54 AM
ఆసియా అథ్లెటిక్స్ పతక విజేతలు శివ్‌పాల్ సింగ్ (జావెలిన్), స్వప్నా బర్మన్ (హెప్టాథ్లాన్)లపై జాతీ య డోపింగ్ నిరోధక సంస్థ...
న్యూఢిల్లీ: ఆసియా అథ్లెటిక్స్ పతక విజేతలు శివ్‌పాల్ సింగ్ (జావెలిన్), స్వప్నా బర్మన్ (హెప్టాథ్లాన్)లపై జాతీ య డోపింగ్ నిరోధక సంస్థ (నాడా) నిషేధం విధించింది. నిషేధిత అనబాలిక్ స్టెరాయిడ్ ‘మెథాండినోన్’ వాడినట్టు తేలడంతో శివ్‌పాల్ సింగ్ పదేళ్ల నిషేధానికి గురయ్యాడు. గతంలోనూ (2021-22) డోపింగ్ నిబంధన ల్ని ఉల్లంఘించిన చరిత్ర ఉండడంతో రెండవ నేరం కింద అతనికి కఠిన శిక్షను ఖరారుచేశారు. మరోవైపు నిషేధిత ఉత్ర్పేరకం ‘బోల్డెనోన్’ వాడినట్టు నిర్ధారణ కావడంతో స్వప్నాబర్మన్‌పై తాత్కాలిక నిషేధం విధించారు. అయితే గత నెలలో ఆమె కెరీర్‌కు రిటైర్మెంట్ ప్రకటించింది.