Share News

వావ్‌.. శీతల్‌

ABN , Publish Date - Sep 10 , 2026 | 05:19 AM

భారత స్టార్‌, ప్రపంచ నెంబర్‌వన్‌ శీతల్‌ దేవి వరల్డ్‌ ఆర్చరీ పారా సిరీస్‌ స్టేజ్‌-3 పోటీల్లో రెండు పతకాలతో అదరగొట్టింది. వ్యక్తిగత విభాగంలో స్వర్ణం, టీమ్‌ ఈవెంట్‌లో కాంస్యం కొల్లగొట్టింది...

వావ్‌.. శీతల్‌

ఓ స్వర్ణం, కాంస్యం కైవసం

  • హర్విందర్‌ జోడీకి పసిడి

  • చివరిరోజు భారత్‌కు 6 పతకాలు

  • ప్రపంచ ఆర్చరీ పారా సిరీస్‌

అహ్మదాబాద్‌: భారత స్టార్‌, ప్రపంచ నెంబర్‌వన్‌ శీతల్‌ దేవి వరల్డ్‌ ఆర్చరీ పారా సిరీస్‌ స్టేజ్‌-3 పోటీల్లో రెండు పతకాలతో అదరగొట్టింది. వ్యక్తిగత విభాగంలో స్వర్ణం, టీమ్‌ ఈవెంట్‌లో కాంస్యం కొల్లగొట్టింది. శీతల్‌కు తోడు పారాలింపిక్‌ చాంపియన్‌ హర్విందర్‌ సింగ్‌, భావన మిక్స్‌డ్‌ టీమ్‌ ఈవెంట్‌లో పసిడి సాధించారు. దీంతో పోటీలకు ఆఖరిరోజైన బుధవారం భారత్‌ ఖాతాలో రెండు స్వర్ణాలు, నాలుగు కాంస్యాలు చేరాయి. ఆద్యంతం ఉత్కంఠగా సాగిన కాంపౌండ్‌ మహిళల వ్యక్తిగత విభాగం ఫైనల్లో శీతల్‌ షూటా్‌ఫలో కజకిస్థాన్‌ ఆర్చర్‌ ఐజదా సీదాన్‌ను ఓడించి విజేతగా నిలిచింది. శీతల్‌, ఐజదా హోరాహోరీగా పోరాడడంతో ఐదు రౌండ్లు ముగిసేసరికి స్కోర్లు 144-144తో సమమయ్యాయి. దీంతో ఫలితం తేల్చేందుకు నిర్వహించిన షూటా్‌ఫలో ప్రత్యర్థి ఐజదా పదికి 9 పాయింట్లు స్కోరు చేయగా.. శీతల్‌ పదికి పదికి కొట్టి స్వర్ణం అందుకుంది. అనంతరం కాంపౌండ్‌ మిక్స్‌డ్‌ టీమ్‌ కాంస్యం పోరులో తోమన్‌ కుమార్‌ జతగా శీతల్‌ 157-145తో ఇరాక్‌ ద్వయం సారా/అబ్బా్‌సపై గెలిచి పతకం చేజిక్కించుకుంది. రికర్వ్‌ మిక్స్‌డ్‌ టీమ్‌ ఈవెంట్‌ టైటిల్‌పోరులో హర్విందర్‌/భావన జోడీ 6-0తో చైనా జంట లియాంగ్‌ కిరోంగ్‌/గ్జియా లీని ఓడించి పసిడి దక్కించుకుంది. ఇక, మహిళల రికర్వ్‌ వ్యక్తిగత ప్లేఆ్‌ఫలో భావన 6-0తో భారత్‌కే చెందిన రాజశ్రీ రాథోడ్‌పై నెగ్గి కాంస్యం పట్టేసింది. మహిళల వ్యక్తిగత కాంపౌండ్‌ మూడోస్థానం పోరులో సరిత 141-140తో వాంగ్‌ హుటింగ్‌ (చైనా)ను ఓడించి కాంస్యం ఖాతాలో వేసుకుంది. పురుషుల కాంపౌండ్‌ వ్యక్తిగత విభాగం ప్లేఆఫ్‌లో తోమన్‌ కుమార్‌ 143-138తో అబ్బాస్‌ ఖాదిమ్‌ (ఇరాక్‌)పై నెగ్గి కాంస్యం కైవసం చేసుకున్నాడు.

Updated Date - Sep 10 , 2026 | 05:19 AM