Share News

నెం.1ను చిత్తుచేసి..ఫైనల్‌కు సాత్విక్‌ జోడీ

ABN , Publish Date - May 31 , 2026 | 04:29 AM

వరల్డ్‌ చాంపియన్‌ జోడీని ఓడించిన సాత్విక్‌ సాయిరాజ్‌-చిరాగ్‌ శెట్టి జంట.. సింగపూర్‌ ఓపెన్‌ ఫైనల్‌కు దూసుకెళ్లింది. శనివారం జరిగిన డబుల్స్‌...

నెం.1ను చిత్తుచేసి..ఫైనల్‌కు సాత్విక్‌ జోడీ

సింగపూర్‌: వరల్డ్‌ చాంపియన్‌ జోడీని ఓడించిన సాత్విక్‌ సాయిరాజ్‌-చిరాగ్‌ శెట్టి జంట.. సింగపూర్‌ ఓపెన్‌ ఫైనల్‌కు దూసుకెళ్లింది. శనివారం జరిగిన డబుల్స్‌ సెమీఫైనల్లో సాత్విక్‌-చిరాగ్‌ జంట 21-19, 21-18తో కొరియా వరల్డ్‌ నెం.1 జోడీ కిమ్‌ వోన్‌ హో-సియో సెవుంగ్‌ జేపై గెలిచారు. మిక్స్‌డ్‌లో తనీషా-ధ్రువ్‌ జంట 16-21, 21-17, 13-21తో జపాన్‌ ద్వయం యుచీ షిమోగమి-సకాయ వొబోరా చేతిలో ఓడింది.

Updated Date - May 31 , 2026 | 04:29 AM