పది ఓవర్లు ముగిసేసరికి భారత్ స్కోరు ఎంతంటే..
ABN , Publish Date - Mar 05 , 2026 | 08:00 PM
పది ఓవర్లు ముగిసే సరికి భారత్ పటిష్ఠ స్థితిలో ఉంది. రెండు వికెట్ల నష్టానికి 119 పరుగులు చేసింది. క్రీజులో సంజూ, శివమ్ దూబే ఉన్నారు.
ఇంటర్నెట్ డెస్క్: ఓపెనర్ సంజూ శాంసన్ దూకుడుగా ఆడుతుండటంతో భారత్ చక్కని రన్ రేట్‌తో దూసుకుపోతోంది. 9 పరుగుల స్వల్ప స్కోరుకే ఓపెనర్ అభిషేక్ శర్మ వెనుదిరిగినా ఆ తరువాత వచ్చిన ఇషాన్‌తో కలిసి సంజూ శాంసన్ స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. అభిషేక్ శర్మ రెండో ఓవర్‌లో విల్ జాక్స్ బౌలింగ్‌లో చివరి బంతిని బౌండరీకి తరలించే ప్రయత్నంలో ఫిల్ సాల్ట్‌కు చిక్కి పెవిలియన్ బాట పట్టాడు. అభిషేక్ తరువాత బరిలోకి వచ్చిన ఇషాన్.. సంజూతో కలిసి స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. దీంతో, భారత్ రన్ రేట్ 10 పరుగులు దాటింది. అయితే, ఇషాన్ కుదురుకుంటున్న సమయంలో 10వ ఓవర్లో వికెట్ కోల్పోవాల్సి వచ్చింది. ఇషాన్ బ్యాట్‌కు తగిలిన బంతిని విల్ జాక్స్ లాంగాఫ్ వద్ద పట్టేయడంతో ఇషాన్ పెవిలియన్ బాట పట్టాల్సి వచ్చింది. ఈ మ్యాచ్‌లో ఇషాన్ 19 బంతుల్లో నాలుగు ఫోర్లు, రెండు సిక్సులో 39 పరుగులు రాబట్టాడు.
ఇక సంజూ ప్రశాంతంగా ఆడుతూ ఇంగ్లండ్ బౌలర్ల భరతం పడుతున్నాడు. కేవలం 26 పరుగుల్లో అర్ధ సెంచరీ సాధించాడు. ఇది సంజూకు వరుసగా రెండో హాఫ్ సెంచరీ కావడం గమనార్హం. డాసున్ బౌలింగ్‌లో సిక్స్‌తో సంజూ అర్థ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. ఇక పది ఓవర్లు ముగిసేసరికి భారత్ స్కోరు 119/2గా ఉంది. క్రీజులో సంజూ (67), శివమ్ దూబె (1) ఉన్నారు.