Share News

శ్రీలంక టెస్ట్ మ్యాచ్‌ లైవ్‌లో సంజయ్ మంజ్రేకర్, కార్తీక్ వాగ్వాదం!

ABN , Publish Date - Aug 18 , 2026 | 09:12 AM

శ్రీలంకతో జరిగిన తొలి టెస్ట్ మ్యాచ్ సమయంలో మాజీ భారత క్రికెటర్లు, కామెంటేటర్లు సంజయ్ మంజ్రేకర్, మురళీ కార్తీక్‌ల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఆన్-ఎయిర్‌లో సరదాగా మొదలైన వాగ్వాదం కాస్తా ముదిరి వివాదాస్పదంగా మారింది.

శ్రీలంక టెస్ట్ మ్యాచ్‌ లైవ్‌లో సంజయ్ మంజ్రేకర్, కార్తీక్ వాగ్వాదం!
Sanjay Manjreka

స్పోర్ట్స్ డెస్క్: గాలే వేదికగా శ్రీలంకతో జరిగిన తొలి టెస్ట్ మ్యాచ్ సమయంలో మాజీ భారత క్రికెటర్లు, కామెంటేటర్లు సంజయ్ మంజ్రేకర్, మురళీ కార్తీక్‌ల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఆన్-ఎయిర్‌లో సరదాగా మొదలైన వాగ్వాదం కాస్తా ముదిరి వివాదాస్పదంగా మారింది. మ్యాచ్ మూడో రోజు లంచ్ విరామ సమయంలో స్టూడియోలో ఉన్న మురళీ కార్తీక్, గ్రౌండ్‌లో కామెంటరీ ఇస్తున్న సంజయ్ మంజ్రేకర్ ముఖ కవళికలను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు వివాదానికి కారణమయ్యాయి.


మ్యాచ్ ప్రత్యక్ష ప్రసార సమయంలో మంజ్రేకర్ ముఖభావాలను ఎద్దేవా చేస్తూ.. 'నీకు సెంచరీ కొట్టేంత ముఖ కవళిక(పౌట్) ఉంది. కానీ దాని వల్ల నువ్వు ఏం మాట్లాడుతున్నావో మాకు అసలు అర్థం కావడం లేదు. దయచేసి ఆ పౌట్ తగ్గించుకో' అంటూ మురళీ కార్తీక్ అన్నాడు.


దీనికి తీవ్రంగా స్పందించిన సంజయ్ మంజ్రేకర్, కార్తీక్ వ్యాఖ్యలను తిప్పికొడుతూ కౌంటర్ ఇంటర్వ్యూ ఇచ్చాడు. ' ఈ మాటలు సరైనవి కాదు. వెంటనే కెమెరాను స్ప్లిట్ స్క్రీన్‌గా మార్చి, అజింక్య రహానే వైపు తిప్పండి. ఎందుకంటే అతడు మాట్లాడేందుకు చాలా ప్రశాంతంగా ఉంటాడు. పైగా అతడి ముఖం కూడా ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది' అంటూ మంజ్రేకర్ కౌంటర్ ఇచ్చారు. అంతేకాకుండా, మురళీ కార్తీక్ తన ముఖం అద్దంలో చూసుకుంటూ తన గొంతును తానే మెచ్చుకుంటాడంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించాడు.


అయితే, పరిస్థితి మరింత చేయి దాటిపోయే సమయంలో ఇద్దరూ సంయమనం పాటించాడు. సోషల్ మీడియాలో దీనిపై రచ్చ జరుగుతుందని గ్రహించిన మంజ్రేకర్.. 'సోషల్ మీడియాలో దీనిపై విపరీతంగా ట్రోల్స్ వస్తాయి, ఫ్యాన్స్‌కు పండగే' అంటూ సరదగా వ్యాఖ్యానిస్తూ ఆ వివాదానికి తెరదించాడు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

Updated Date - Aug 18 , 2026 | 09:13 AM