Share News

సైన్యామ్‌..కొట్టింది రజతం

ABN , Publish Date - Jul 25 , 2026 | 02:27 AM

ఐఎస్ఎస్ఎఫ్ వరల్డ్‌ కప్‌లో భారత షూటర్‌ సైన్యామ్‌ రజతంతో మెరిసింది. శుక్రవారం ఇక్కడ జరిగిన మహిళల 10 మీటర్ల ఎయిర్‌ పిస్టల్‌ ఈవెంట్‌ ఫైనల్స్‌లో..

సైన్యామ్‌..కొట్టింది రజతం

షూటింగ్‌ ప్రపంచకప్‌

హాంగ్జౌ: ఐఎస్ఎస్ఎఫ్ వరల్డ్‌ కప్‌లో భారత షూటర్‌ సైన్యామ్‌ రజతంతో మెరిసింది. శుక్రవారం ఇక్కడ జరిగిన మహిళల 10 మీటర్ల ఎయిర్‌ పిస్టల్‌ ఈవెంట్‌ ఫైనల్స్‌లో సైన్యామ్‌ 243.4 స్కోరు చేసి రెండో స్థానంతో పోడియం ఫినిష్‌ చేసింది. కియాన్‌గ్జున్‌ యావో (చైనా)కు స్వర్ణం, హనియే రోస్తామియాన్‌ (ఇరాన్‌)కు కాంస్యం దక్కాయి. ఇక, ఇదే ఈవెంట్‌లో పోటీపడ్డ తెలుగు షూటర్‌ ఇషా సింగ్‌ 13వ స్థానానికి పరిమితమై ఫైనల్‌ కూడా చేరలేకపోయింది.

Updated Date - Jul 25 , 2026 | 02:27 AM