Wrestler Ritika: డోపీ రెజ్లర్ రీతికపై వేటు
ABN , Publish Date - Jan 02 , 2026 | 05:53 AM
డోపింగ్‌లో పట్టుబడిన రెజ్లర్ రీతిక హుడాను టార్గెట్ ఒలింపిక్ పోడియం పథకం (టాప్స్) నుంచి తప్పించగా.. కాంపౌం డ్ ఆర్చర్లు పర్ణీత కౌర్, అభిషేక్ వర్మలను కోర్ గ్రూప్‌నకు ప్రమోట్ చేశారు.
కోర్ గ్రూప్‌లోకి కాంపౌండ్ ఆర్చర్లు
టాప్స్ జాబితా విడుదల
న్యూఢిల్లీ: డోపింగ్‌లో పట్టుబడిన రెజ్లర్ రీతిక హుడాను టార్గెట్ ఒలింపిక్ పోడియం పథకం (టాప్స్) నుంచి తప్పించగా.. కాంపౌం డ్ ఆర్చర్లు పర్ణీత కౌర్, అభిషేక్ వర్మలను కోర్ గ్రూప్‌నకు ప్రమోట్ చేశారు. 2028 లాస్ ఏంజిల్స్ ఒలింపిక్స్‌లో కాంపౌండ్ ఆర్చరీని కూడా చేర్చారు. ఈ విభాగంలో భారత్‌కు పతకాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉండడంతో మొత్తం ఎనిమిది మంది కాంపౌండ్ ఆర్చర్లకు కోర్ గ్రూప్‌లో స్థానం లభించింది. 118 మంది పేర్లతో తాజా జాబితాను క్రీడా మంత్రిత్వ శాఖ విడుదల చేసింది. ఇందులో 57 మంది సాధారణ, 61 మంది పారా అథ్లెట్లున్నారు. జావెలిన్‌లో నీరజ్ చోప్రాతోపాటు సచిన్ యాదవ్‌కు ఈసారి టాప్స్‌లో చోటుదక్కింది. ఆసియా చాంపియన్‌షి్‌ప్స పతక విజేత హుడా డోపింగ్‌లో విఫలం కావడంతో టాప్స్ నుంచి తప్పించినట్టు సాయ్ అధికారి ఒకరు తెలిపారు.