పంత్‌కు గాయం
ABN , Publish Date - Oct 13 , 2026 | 05:19 AM
న్యూజిలాండ్-ఎ జట్టుతో జరగనున్న మూడు టెస్టుల అనధికారిక సిరీస్‌కు ముందు భారత-ఎ జట్టుకు ఎదురుదెబ్బ తగిలింది. స్టార్ వికెట్‌కీపర్, బ్యాటర్ రిషభ్ పంత్ గాయం కారణంగా..
కివీస్-ఎతో రెండు మ్యాచ్‌లకు దూరం
కుశాగ్రకు భారత-ఎ జట్టులో చోటు
న్యూఢిల్లీ: న్యూజిలాండ్-ఎ జట్టుతో జరగనున్న మూడు టెస్టుల అనధికారిక సిరీస్‌కు ముందు భారత-ఎ జట్టుకు ఎదురుదెబ్బ తగిలింది. స్టార్ వికెట్‌కీపర్, బ్యాటర్ రిషభ్ పంత్ గాయం కారణంగా.. కివీస్-ఎతో జరిగే రెండు మ్యాచ్‌లకు దూరమయ్యాడు. పంత్ స్థానంలో వికెట్ కీపర్, బ్యాటర్ కుమార్ కుశాగ్రకు జట్టులో చోటు దక్కింది. ఇటీవల జరిగిన ఇరానీ కప్‌లో పంత్‌కు పక్కటెముల గాయమైంది. కాగా, ఫిట్‌నెస్ అనుమతులకు లోబడే పంత్‌ను కివీస్-ఎతో తొలి రెండు టెస్టులకు తొలుత ఎంపిక చేశారు. అయితే, అతడి గాయం తీవ్రమైనది కావడంతో తాజాగా పంత్‌కు ఫిట్‌నెస్ క్లియరెన్స్ లభించలేదు. అయితే, మూడో మ్యాచ్‌కు రిషభ్ అందుబాటులో ఉంటాడా? లేదా? అనేది త్వరలో నిర్ణయిస్తామని బీసీసీఐ తెలిపింది. కాగా, న్యూజిలాండ్‌లో టీమిండియా పర్యటనకు ముందు.. అంటే ఈనెల 24 నుంచి కివీస్-ఎ, భారత-ఎ జట్ల మధ్య మూడు మ్యాచ్‌ల అనధికార టెస్టు సిరీస్ జరగనుంది.