Share News

సింధు, ఉన్నతికి నిరాశ

ABN , Publish Date - Sep 28 , 2026 | 05:20 AM

ఈసారి ఆసియా క్రీడల బ్యాడ్మింటన్‌లో భారత్‌ ఒకే ఒక పతకం.. కాంస్యంతో వెనుదిరిగింది. మహిళల సింగిల్స్‌లో పీవీ సింధు, ఉన్నతి హుడా, మహిళల డబుల్స్‌లో...

సింధు, ఉన్నతికి నిరాశ

గాయత్రి జోడీ కూడా ఓటమి

నగోయ: ఈసారి ఆసియా క్రీడల బ్యాడ్మింటన్‌లో భారత్‌ ఒకే ఒక పతకం.. కాంస్యంతో వెనుదిరిగింది. మహిళల సింగిల్స్‌లో పీవీ సింధు, ఉన్నతి హుడా, మహిళల డబుల్స్‌లో గాయత్రి జోడీ, మిక్స్‌డ్‌ డబుల్స్‌లో ధ్రువ్‌ కపిల ద్వయం కూడా క్వార్టర్స్‌లో పరాజయం పాలవడంతో పురుషుల టీమ్‌ విభాగంలో వచ్చిన ఒకే ఒక్క పతకంతో భారత్‌ పయనం ముగిసింది. ఇక..ఆదివారం జరిగిన మహిళల సింగిల్స్‌ క్వార్టర్‌ఫైనల్లో సింధు 21-11, 18-21, 10-21తో చెన్‌ యుఫీ చేతిలో పోరాడి ఓడింది. మరో క్వార్టర్స్‌లో 19 ఏళ్ల ఉన్నతి 16-21, 21-14, 17-21తో యమగూచి చేతిలో ఓటమి చవిచూసింది. మహిళల డబుల్స్‌ క్వార్టర్‌ఫైనల్లో గాయత్రి/ట్రీసా జంట 18-21, 9-21తో మలేసియా జోడీ పియర్లీ/థినా చేతిలో పరాజయం పాలైంది. మిక్స్‌డ్‌ డబుల్స్‌లో ధ్రువ్‌ కపిల/తనీషా క్రాస్టో ద్వయం పోరాడి ఓడింది.

అథ్లెటిక్స్‌ పురుషుల 800మీ. పరుగులో అఫ్సల్‌, 100మీ. హర్డిల్స్‌లో నందిని, లాంగ్‌జంప్‌లో మురళీ శ్రీశంకర్‌, సోలమన్‌ ఫైనల్‌ చేరారు. మహిళల 4గీ100మీ.లో భారత జట్టు తుదిపోరులో అడుగుపెట్టింది. షూటింగ్‌ 25 మీ. పిస్టల్‌లో వ్యక్తిగత విభాగం ప్రెసిషన్‌ దశ ముగిసే సరికి హైదరాబాదీ ఇషా సింగ్‌ ఆరో స్థానంలో నిలిచింది. 25 మీ. పిస్టల్‌ టీమ్‌ విభాగంలో ప్రెసిషన్‌ దశ ఆఖరికి భారత్‌ (864) మూడో స్థానంలో కొనసాగుతోంది.

ఇవి కూడా చదవండి:

అభయ్ సింగ్‌కు రూ.50 లక్షల నజరానా.. ప్రకటించిన సీఎం విజయ్

Updated Date - Sep 28 , 2026 | 05:20 AM