Share News

క్వార్టర్‌ఫైనల్లో సింధు

ABN , Publish Date - Oct 09 , 2026 | 01:14 AM

రెండుసార్లు ఒలింపిక్‌ పతక విజేత పీవీ సింధు ఆర్కిటిక్‌ ఓపెన్‌ సూపర్‌ 500 బ్యాడ్మింటన్‌ టోర్నీ క్వార్టర్‌ఫైనల్లో ప్రవేశించింది.

క్వార్టర్‌ఫైనల్లో సింధు

  • తరుణ్‌, తన్వీ ఓటమి జూఆర్కిటిక్‌ ఓపెన్‌

వంతా (ఫిన్లాండ్‌): రెండుసార్లు ఒలింపిక్‌ పతక విజేత పీవీ సింధు ఆర్కిటిక్‌ ఓపెన్‌ సూపర్‌ 500 బ్యాడ్మింటన్‌ టోర్నీ క్వార్టర్‌ఫైనల్లో ప్రవేశించింది. యువ ఆటగాళ్లు తరుణ్‌ మన్నేపల్లి, తన్వీశర్మ పరాజయం పాలయ్యారు. గురువారం జరిగిన మహిళల సింగిల్స్‌ రెండో రౌండ్‌లో 31 ఏళ్ల సింధు 21-15, 21-15తో రికో గుంజిపై విజయం సాధించింది. క్వార్టర్‌ఫైనల్లో టాప్‌ సీడ్‌ రచనోక్‌ ఇంటానన్‌ను సింధు ఎదుర్కొంటుంది. మరో మ్యాచ్‌లో ఇంటానన్‌ 21-18, 21-7తో తన్వీశర్మను ఓడించింది. పురుషుల సింగిల్స్‌ ప్రీక్వార్టర్‌ఫైనల్లో క్రిస్టో పొపోవ్‌ (ఫ్రాన్స్‌) 21-14, 21-19తో తరుణ్‌పై గెలుపొందాడు.పురుషుల డబుల్స్‌ లో కృష్ణప్రసాద్‌/కృష్ణమూర్తి రాయ్‌ 21-19, 22-20తో బట్లర్‌/జోన్స్‌పై నెగ్గి క్వార్టర్‌పైనల్లో అడుగుపెట్టింది. వరల్డ్‌ మాజీ నెం.1 కిడాంబి శ్రీకాంత్‌ తొలి రౌండ్‌లోనే ఓడాడు.

Updated Date - Oct 09 , 2026 | 01:15 AM